Prakash Raj Checking CCTV Of MAA Elections
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఎన్నికల తర్వాత అంతా సెట్ అవుతుంది అనుకుంటే.. రచ్చ ఇంకా పెరుగుతుందే కానీ.. తగ్గడం లేదు. ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓడిపోయినా.. తగ్గేదేలే.. అంటూ వివాదాలు సృష్టిస్తూ దూసుకెళుతున్నారు. మా ఎన్నికలు జరగడం పై అనుమానాలు ఉన్నాయంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ని సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే.. ఈరోజు మా ఎన్నికల పోలింగ్ కేంద్రానికి ప్రకాష్ రాజ్ వెళ్లారు.
మరో నటుడు బెనర్జీతో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు చేరుకుని పోలింగ్ రోజు నాటి సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలీసుల సమక్షంలో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. అంతకు ముందు ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సీసీ ఫుటేజీ పరిశీలించుకోవచ్చని మా అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ మాత్రం కోర్టుకు వెళ్లమని సూచించారు. తమ ఫిర్యాదుల పై ఆయన స్పందించడం లేదు.
Prakash Raj Checking CCTV Of MAA Elections
మా ఎన్నికల అధికారితోనే తమకు ప్రధాన సమస్య. ఎన్నికల ఓట్ల లెక్కింపు పై కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినట్లు చెప్పారు. మరో వైపు మా అధ్యక్షుడు విష్ణు తన ప్యానల్ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లినట్టు సమాచారం. ప్రకాష్ రాజ్, నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం గురించి స్పందిస్తూ.. వాళ్ల రాజీనామాను ఆమోదించలేదు అన్నారు. రోజురోజుకూ మా వివాదం ముదురుతోంది. మరి.. ఈ వివాదాలకు ఎప్పుడు ఫుల్ స్టాఫ్ పడుతుందో చూడాలి.