Chiranjeevi Personal Message To Pooja Hegde
క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే.. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఏమాత్రం టైమ్ దొరకడం లేదని.. తనతో ఫోన్లో మాట్లాడాలన్నా కూడా దొరకడం లేదని ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పడం జరిగింది. అయితే.. ఇప్పుడు ఈ అమ్మడుకు టైమ్ దొరికిందో లేక సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో మాట్లాడాలి అనిపించిందో ఏమో కానీ ఆస్క్ పూజా అంటూ ప్రశ్నలు అడగమంది. పూజా అలా చెబితే కాదంటారా..? ఆస్క్ పూజా హెగ్డే పేరిట హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తూ అభిమానులు పలు ప్రశ్నలు సంధించారు.
ఈ మేరకు పూజా హెగ్డే అందులో కొన్నిటికి సమాధానం ఇవ్వడం జరిగింది. అందులో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం గురించి అడగగా.. అది పీరియాడిక్ లవ్ స్టోరీ.. చాలా గొప్పగా ఉంటుంది. అద్భుతమైన విజువల్స్ తో ఉంటుందని చెప్పింది. ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ గురించి అడిగితే.. స్వీటెస్ట్ అని.. కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ఒక్క ముక్కలో చెప్పండి అని అడగగా కన్నడ సినీ పరిశ్రమ గర్వ పడే స్టార్ అని చెప్పింది.
Chiranjeevi Personal Message To Pooja Hegde
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటించారు కదా ఎలా ఫీలవుతున్నారు అని అడిగితే.. ‘ఆచార్య గురించి ఇప్పుడు ఏమీ చెప్పలేను కానీ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం చూసి చిరంజీవి గారు నీ నటన బాగుంది. చాలా బాగా నటించావ్ అని మెచ్చుకున్నారు. ఆయన నుంచి మెసేజ్ రావడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు అలా చెప్పడం.. మరింత కష్టపడి పని చేయడానికి స్ఫూర్తినిచ్చింది’ అంటూ చిరు పంపిన మెసేజ్ ను బయటపెట్టింది పూజా.