రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న కుట్ర మరోసారి బయటపడింది. కర్నూలు ప్రైవేట్ బస్సు ప్రమాదాన్ని అడ్డుగా పెట్టి ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి దుష్ర్పచారం చేస్తున్న 30 మందిపై అక్టోబర్ 30న పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కూడా ఉన్నారు. తాజాగా ఈ కేసులో విచారణకు హాజరైన శ్యామల కీలక విషయాలు వెల్లడించారు.
శ్యామల ఏం చెప్పారంటే –
శ్యామలను గంటన్నరపాటు విచారించారు. ప్రమాదానికి ముందు శివశంకర్, అతడి మిత్రుడు ఎర్రిస్వామిలు బెల్టు దుకాణంలోని మద్యం తాగారని ఎవరు చెప్పారు? దానికి తగిన ఆధారాలున్నాయా..ఉంటే చూపాలంటూ పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్యామల నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేశారని అడగ్గా.. తాను వైసీపీ అధికార ప్రతినిధి కావడంతో వారిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే ప్రెస్‌మీట్ పెట్టినట్లు చెప్పారు.
విచారణ అనంతరం బయటకు వచ్చిన శ్యామల మీడియాతో మాత్రం మాట మార్చేశారు. నాడు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తాను వైసీపీ అధికార ప్రతినిధిగా 10 ప్రశ్నలు అడిగానని, వాటిలో తప్పేముందని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన శివశంకర్, ఎర్రి స్వామి బెల్టు షాపులో మద్యం కొనుగోలు చేశారని వైసీపీ మీడియా ఓ వీడియోను, ఫోటోలను వైరల్ చేసింది. ఐతే దీనిని పరిశీలించిన ప్రభుత్వం అప్పటికే క్లారిటీ ఇచ్చింది. లైసెన్స్ ఉన్న మద్యం షాపులోనే శివశంకర్ ఎర్రి స్వామి మందు కొనుగోలు చేశారని, వైసీపీ దుష్ర్పచారం చేస్తున్నట్లుగా అది బెల్టు షాపు కాదని క్లారిటీ ఇచ్చింది











