వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్‌ఎల్‌ఏ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలు అంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది.. గతంలో సత్తెనపల్లిలో ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి, ఓ వ్యక్తిని బ*లికొంది జగన్ కాన్వాయ్.. ఆ తర్వాత చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్లి అక్కడ మామిడి రైతులను పరామర్శించారు.. నాడు ఇద్దరు పోలీసులకి గాయాలయ్యాయి.. ఈ ఘటనలతో జగన్ పర్యటనలు, పరామర్శలు అంటేనే ప్రజలు భీతిల్లిపోతున్నారు.. అన్న వస్తున్నాడంటేనే రోడ్ ఎక్కడానికి హడల్ ఎత్తిపోతున్నారనే ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు..
తాజాగా జగన్ కాన్వాయ్‌లో భారీ ప్రమాదం తప్పింది.. మొంథా తుఫాన్ బాధితులని పరామర్శించడానికి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట పర్యటన ప్లాన్ చేసుకున్నాడు జగన్.. ఆయన కాన్వాయ్‌లో పర్యటిస్తుండగా, తనను అనుసరిస్తున్న కార్యకర్తల కోసం పూల బొకే విసిరేశాడు వైసీపీ అధినేత.. జగన్ అన్న విసిరిన బొకేని అందుకోవాలని ఇద్దరు మహిళలు ప్రయత్నం చేశారు.. కాన్వాయ్ రన్నింగ్ లో ఉండడం, ఇటు ఆ మహిళా కార్యకర్తలు కూడా రన్నింగ్‌లోనే ఉండడంతో బొకేను అందుకునే ప్రయత్నంలో కింద పడబోయారు..
రోప్ వే టీమ్‌లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమై ఆ మహిళలను చేయిపట్టి కాపాడారు.. లేదంటే, వారు కారు కాన్వాయ్ కింద పడేవారే అని విజువల్స్‌లో క్లియర్‌గా అర్ధం అవుతోంది.. రోప్ వే పార్టీలోని పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి, ఆయన స్పీడ్‌కి ప్రజలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.. జగన్ కాన్వాయ్ కింద పడకుండా వారి ప్రాణాలను కాపాడారని కొనియాడుతున్నారు.. విధి నిర్వహణలో పోలీస్ అంటే ఇలా ఉండాలని కితాబులు ఇస్తున్నారు నెటిజన్స్..
ఈ సంగతి పక్కనపెడితే, జగన్ పర్యటనలు అంటే భయపడాల్సి వస్తోందని, వాటికి దూరంగా ఉండడం బెటర్ అనే సెంటిమెంట్ ప్రజల్లోకి బలంగా వెళుతోంది.. దీనిపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ చేస్తే మంచిది అని చెబుతున్నారు కార్యకర్తలు.. ఏది ఏమైనా రాజకీయ నేతల టూర్‌లకి ప్రజలు గుమిగూడితే ఏం జరుగుతుందో కరూర్ ఘటన మరోసారి అప్రమత్తం చేసింది.











