మా ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం కొద్ది సేపు పోలింగ్ కు అంతరాయం కలిగించింది. మా లో సభ్యుడు కాని ఓ వ్యక్తి వచ్చి దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. అతను ఓటు వేయకుండా మొదట్లోనే నివారించారు. విష్ణు ప్యానల్ సభ్యులు అతన్ని పట్టుకున్నారు. వదిలేయమని చెప్పడంతో వదిలేశారు. ఎన్నికల అధికారులు కొద్దిసేపు పోలింగ్ నిలిపేశారు. ఇలాంటి పరిణామాలు తల్లెత్తితే సీరియస్ గా వ్యవహరించాల్సి వస్తుందని, పోలింగ్ నిలిపివేస్తామని హెచ్చరించారు.
దొంగ ఓట్ల ఆరోపణల మీద సీసీటీవీ ఫుటేజి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అయితే ఈ విషయంతో మంచువిష్ణు, ప్రకాష్ రాజ్ ఇద్దరూ స్పందించారు. దొంగ ఓట్లు పడలేదని, ఒక వ్యక్తి ఆ ప్రయత్నం చేయడంతో తాము మొదట్లోలోనే నిలువరించామన్నారు. ఎన్నికల అధికారి కూడా ఇద్దరి తోనూ చర్చలు జరిపారు. ఇద్దరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.
ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. రిగ్గింగు జరిగితే మాత్రం ఎన్నికల ఫలితాలను ప్రకటించబోమని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. నాగబాబు మాట్లాడుతూ తాను మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానల్ కే ఓటు వేసినట్టు చెప్పారు. అది ప్రజాస్వామ్యబద్దమైన ప్యానల్ అన్నారు. ప్రకాష్ రాజ్ తరఫున ఒకరు దొంగ ఓటు వేసినట్టు ఎన్నికల అధికారి తెలిపారు.











