ఆర్థిక వృద్ధి, అభివృద్థిని లక్ష్యపెట్టని నాయకత్వానికి చరిత్ర ఉండదు!?
రాష్ట్ర ప్రజలు నాయకత్వ మార్పుకై ఇచ్చిన ఒకేఒక్క అవకాశంతో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు! పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రజల వాకిట ముందు, రోడ్లంబడి ఓట్ల కోసం బిచ్చగాడిలా నటించాడు. గెలిచిన తరువాత తాడేపల్లిలో ప్యాలెస్ లో విలాసా మోజులో, అధికారమిచ్చిన అమితానందం మునిగి తేలుతున్నాడు. రాష్ట్రంలో రోడ్లు కొన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయంలో కాంగ్రెస్ వేయిస్తే.. ఎక్కువ శాతం విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు హయంలో వేసినవే. జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర రోడ్లకు బొచ్చ కంకర, చెంబు తార పోసిన పాపాన పోలేదు అన్నది విపక్షాల విమర్శ! శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రోడ్లు అభివృద్ధికి నోచుకోకా.. 75 సంవత్సరాలు వెనక్కి అంటే.. బ్రిటిష్ కాలం రోడ్లను తలపిస్తున్నాయి. 5 వేల కోట్ల వ్యచ్చిస్తే.. స్టేట్ ప్రధాన రోడ్లన్నీ ఆల్ మోస్ట్ ఒక కొలిక్కొస్తాయి. కానీ ఎప్పుడు దానిపై జగన్ రెడ్డి దృష్టిసారించలేకపోయారు. ప్రజలు, ప్రత్యపక్షాలు దుమ్మెత్తపోస్తుంటే.. చేసిన తప్పును తెలుసుకుని ఇప్పుడు రోడ్లు వేద్దామని భావిస్తున్నప్పటికీ, వాటిని వేసేందుకు కాంట్రాక్టర్లు విముఖత చూపుతున్నారు. మరోవైపు జగన్ రెడ్డిని నమ్మి కాంట్రాక్టును తీసుకునేందుకు ముందుకు రావడంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ కే ఇంతవరకు దాదాపు రూ.1000 కోట్లకు పైగా బిల్లులు చెల్లించలేని పరిస్థితి జగన్ రెడ్డి ప్రభుత్వానిది. దీని కారణంగా నాడు – నేడు లో కాంట్రాక్ట్ వర్క్స్ చేసిన కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారు. చివరికి నడిరోడ్డుపైకి వచ్చి బిల్లుల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది.
నెల్లూరు జిల్లాలో అధికారపార్టీ అకృత్యాలు..!
భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని, రోడ్లును అస్తవ్యస్థం చేశాయి. రాష్ట్రంలో ప్రధాన రహదారులు, ప్రధాన రహదారులను కలిపే లింకు రోడ్లు గతంలో ఎన్నడూలేని విధంగా డ్యామేజ్ అయ్యాయి. అయితే వీటిని యుద్ధప్రాతిపదికన ఆధునీకరించాల్సిన ఏపీ ప్రభుత్వం, ఆ చర్యలను పక్కనపెట్టింది. ఇకపోతే నెల్లూరు జిల్లాలో ఇసుకను తరలించేందుకు భారీ రోడ్డును నిర్మిస్తున్నారు. జిల్లాలో రోడ్లన్నీ గుళ్లబారి, గుంటల మయంగా దర్శనిమిస్తుంటే.. వాటిని అలా గాలికొదిలేసి, ఇసుక దందాకు ఇబ్బందిగా ఉందని ఆఘమేఘాల మీద ఇందుకూరుపేట మండలం పల్లిపాడు రోడ్డు వేయడం ఏమిటని జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకి వంద టిప్పర్ల ద్వారా గ్రావెల్స్ ను తీసుకొచ్చి, 200 ట్రాక్టర్లు, జేసీబీలు సాయంతో రోడ్డును నిర్మించారు. అయితే ఈ రోడ్డును కాంట్రాక్టర్ ఇసుక తొలుకునేందకు వేయించుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఒక కాంట్రాక్టర్ ఉన్న శ్రద్ధ, ప్రభుత్వానికి ఎందుకు పట్టడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. రోడ్ల అభివృద్ధికి వర్షాలు అడ్డంకిగా మారాయని చెప్పుకొస్తున్న ఏపీ ప్రభుత్వం.. వర్షాలు తగ్గుముఖం పట్టినా, వాటిని వేసేందుకు సుముఖత చూపడం లేదు. ఇసుకను అఫిషియల్ గా కాంట్రాక్టర్ చేతిలో పెట్టి, చేస్తున్న ఇల్లీగల్ దందా ప్రజలకు అర్థంకానిది కాదు. పాలన పగ్గాలు చేపట్టి 30 నెలలు దాటిన, నేటికి ఇసుక బ్లాక్ మార్కెట్ నడిస్తోంది! ఇటువంటి చర్యలను ప్రజలు ఎలా మరిచిపోతారు? మొండి వాడి మార్పును ఆశించడం కూడా అవివేకమేనని అంతిమంగా తెలుసుకుని అవకాశం కోసం నిరీక్షిస్తున్నారు!










