నామినేషన్లకు, ప్రచారానికి అడ్డుకోవడమేమిటి? సిగ్గు .. సిగ్గు!
నవ రకాల పథకాలను వండివార్చుతున్న ప్రభుత్వం, అత్యత ప్రజాధరణతో గద్దెనెక్కిన రాజకీయ పార్టీ గా చెప్పుకునే వైసీపీ .. నేడు లోకల్ ఎన్నికల్లో గెలుపు కోసం ఫీట్లు చేయాల్సివస్తోంది. మీ పథకాలు పూర్తిగా ప్రజలకు చేరి వారు సంతృప్తి పరుస్తున్న తరుణంలో ఈ రాజకీయ జులం ప్రదర్శించాల్సిన అవసమేమిటి? అని నిలదీస్తున్నారు. ప్రతిపక్షం బలహీన పడిందని, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వయసు ఉడిగిపోయిందని మీడియా ముందు మంత్రులు, ఎమ్మెల్యే బీరాలు పలికుతూ .. లోకల్ మిని వార్ లో ఈ ఉలుకేందుకో అర్థంకావడం లేదు. గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల.. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ చేస్తున్న దాడులు, కుట్రలన్నీంటిని ప్రజలు గమనిస్తునే ఉన్నారు. అధికారముంటే ఏదైనా సాధ్యపడుతోంది అనుకోవడం అవివేకం. చట్టం, న్యాయం, ధర్మం అంటూ మూడుంటాయి. అవి ఎవరికి అతీతం కావు అన్నది గుర్తుంచుకోవాలి. విపక్షాలు నామినేషన్ వేస్తామన్నా.. ప్రచారం చేస్తామన్నా .. అడ్డుకోవడం సిగ్గుచేటు. రాజ్యాంగం అందిరికి సమానమైన హక్కులు కల్పించింది. ఏ ఒక్క చర్యైనా రాజ్యాంగానికి లోబడే చేయాల్సి ఉంటుంది. కాదు కూడదు అంటే కోర్టు మెట్లున్నాయి .. అక్కడే అన్ని సమస్యలకు న్యాయ పరిష్కారాలు లభిస్తాయని సామాన్యుడికి సైతం బోధపడింది.
అరెస్ట్లు, గృహ నిర్భందాలతో సాధించేదేమీ లేదు!
ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతి ఒక్కరికీ నిబంధనలతో కూడిన హక్కులను ప్రసాదించింది మన రాజ్యాంగం. అంతేకానీ అధికారం చేతులో ఉంది కదా అని అడ్డుగోలుగా ప్రజలపై, ప్రజాప్రతినిధులపై పడి పైత్యాన్ని చూపితే .. చట్టాలు, న్యాయం అంటూ కోర్టులు బ్యాండ్ వాయిస్తాయని ఇంకా అధికారపార్టీకి తెలిసొచ్చినట్లు లేదు కాబోలు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో కోర్టు ఆదేశాలను సైతం పోలీసులు లెక్కచేయడం లేదు. ఎన్నికల ప్రచారం చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులను గృహనిర్బంధం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల అడ్డుకోవడం చట్టవ్యతిరేకం, అలానే సెక్షన్ 14,19 కి విరుద్దం. దీనిపై ఎస్పీ, డీఎస్పీ సమాధానం చెప్పాలని కోర్టు ఉత్తర్వులిచ్చిన వాటిని పక్కన పెట్టి మరి దిక్కరానికి పాల్పడుతున్నారు. జగన్ రెడ్డికి ఓటిమి భయం పట్టుకుని పోలీసులను అడ్డుపెట్టుకుని ఆరాచకాలకు పాల్పడుతున్నారని, అలా చేయకుండా ఒక్క కౌన్సిల్ సీట్ కూడా వైసీపీ గెలవలేదని టీడీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.











