మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ .. ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో వరుసగా హిట్స్ కొట్టి.. మంచి ఊపుమీదున్నాడు. ఈ నేపథ్యంలో ఈ హీరో తాజాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటించాడు. సుబ్బు అనే కొత్త కుర్రోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నభానటేష్ హీరోయిన్ గా నటించింది. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్.. ఇటీవలే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేసింది.
నిజానికి ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ.. ఇటీవల థియేటర్స్ తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో త్వరలో థియేటర్స్ లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా సింగిల్స్ , టీజర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా మెగా మేనల్లుడికి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.