బూతు అనేది మనం ఆలోచించే విధానంలోనే ఉంది. రామా అని పిలిచినా రామ్మా అని పిలిచినట్టు వినిపిస్తుంది కొందరికి. అదేంటో గానీ సమంత ఇప్పుడు బూతు పాట వలలో చిక్కుకుంది. అల్లు హీరోగా రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో సమంత ఓ ఐటమ్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించినప్పటికీ ఐటమ్ సాంగ్ చేయడానికి సమంత ఒప్పుకుంది. దానికి కారణం అంతకుముందు సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం చేసి ఉండటమే.
ఈ పాట చిత్రీకరణ ఇటీవలే జరిగింది. దీనికి ముగ్గురు కొరియోగ్రాఫర్లు పనిచేసినట్టు సమాచారం. ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ అనే పల్లవితో సాగే ఈ పాట మాస్ ప్రేక్షకుల కోసమే రాసినట్టుంది. పైగా ఇందులో సమంత మంచి హాట్ గా కనిపిస్తోంది. ఈ పాట లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట సాహిత్యంలో బూతు ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మగవారిని తప్పుగా భావించేలా పాట ఉందన్నది ప్రధాన ఆరోపణ. అమ్మాయిలు ఎలా ఉన్నా మగవారు విడిచిపెట్టరని, మగ బుద్ధే వంకర బుద్ధి అనే అర్థంలో పాట ఉంది.
చీకటి పడితే మగవాళ్లంతా అలాగే ప్రవర్తిస్తారట. పాటంతా బూతులే అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇంద్రవతి చౌహన్ తన హస్కీ వాయిస్ తో పాడింది. ఈ పాట కూడా యూట్యూబ్ లో వ్యూస్ ని కొల్లగొడుతోంది. కురచ దుస్తుల్లో సమంత కనిపిస్తోంది. గతంలో ఆమె నేనొక్కడినే సినిమా విడుదల సందర్భంగా సమంత చేసిన ట్వీట్ ను నెటిజన్లు పైకి తెచ్చారు. ఆ సినిమా పోస్టర్ దారుణంగా ఉందని కామెంట్ చేసింది. ఆ పోస్టర్ లో హీరోయిన్ కృతిసనన్ మహేష్ బాబు పాదాలపై వాలిపోతుంది. ఇప్పుడు నువ్వు చేసింది ఏమిటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో సమంత కాస్త ఇరకాటంలో పడింది. ఇదిప్పుడు భారీగా ట్రోల్ అవుతోంది.











