సమంత హాట్ సీటు మారిపోయింది. ఇప్పుడా సీటు జూనియర్ ఎన్టీఆర్ ముందుంది. సమంతను తన ముందున్న హాట్ సీటులోకి ఎన్టీఆర్ ఆహ్వానించారు. అక్కడ కూర్చుంటే భయండా ఉంది అని సమంత అంటే.. ‘ఉంటుంది.. ఎందుకంటే ఇది హోస్ట్ సీట్.. అది హాట్ సీట్. మామూలుగా ఎవరైనా వెయ్యి నుంచి కోటికెళతారు.. నువ్వు కోటి నుంచి వెయ్యికొస్తావ్.. ఎంత బాగుంటుంది కదా ఆట’ అని ఎన్టీఆర్ అంటే ‘వద్దులెండి ఆ డబ్బు’ అని సమంత అంటే ‘వద్దా’ అని ఎన్టీఆర్ కవ్వించగానే ‘కావాలి.. కావాలి’ అనేసింది సమంత.
‘క్విట్ అయిపోతావా?’ అని ఎన్టీఆర్ అంటే ‘అదేంటి ఇప్పుడు చెబుతున్నారు.. ముందే చెప్పాలి కదా’ అంది సమంత. ఇంతకీ ఈ హాట్ సీటు.. అంతకన్నా హాట్ సన్నివేశం మరెక్కడో కాదు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కోసం జెమినీ టీవీలోనే. సెలబ్రిటీ హోస్ట్ గా ఈ నవరాత్రి రోజు ప్రసారమయ్యే స్పెషల్ షో కోసం సమంత హాజరైంది. సరదా సరదాగా సాగే ఈ సన్నివేశం షోమీద ఆసక్తిని మరింత పెంచింది.
అసలు ఇప్పుడు సమంతను పెంచిన హాట్ గెస్ట్ ఇంకొకరు లేరు. ఈ షోలో సమంత రూ. 25 లక్షలు గెలుచుకున్నట్టు సమాచారం. ఈ మొత్తాన్ని సమంత ఓ చారిటీకి అందజేసినట్టు కూడా తెలిసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ముంబైలో సెటిల్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె హైదరాబాద్ లోనే ఉండాలని నిశ్చయించుకున్నట్లు తాజా సమాచారం. మొన్నామధ్య ఈ యాడ్ ఫిలిం షూట్ లో సమంత కళ్లనీళ్లు పెట్టుకున్నట్లు వార్తలొచ్చాయి.
కానీ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసే ఈ షోలో మాత్రం సమంత హుషారుగానే కనిపించింది. షోకి మంచి బజ్ కూడా వచ్చేసింది. విజయదశమి రోజు ఈ షో ప్రసారం కానుందట. వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్, రామయ్యా వస్తావయ్య, రభస, బృందావనం తదితర చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ ఆమెను హాట్ సీటుపై కూర్చోబెట్టారు. అసలే హాట్ గా ఉండే సమంతకు ఈ సీటు ఇంకెంత హాట్ గా అనిపించిందో.











