‘ఆహా’ ఓటీటీలో సమంత హోస్ట్ గా ఓ కార్యక్రమం ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం సామ్ జామ్ అంటున్నా లోగో మాత్రం సమాజం అనేలా ఉంది. మొత్తానికి సామ్ జామ్ దీపావళికి సందడి చేయబోతోంది. ఈ టాక్ షో సెలబ్రీటీలకు అడ్డాగా మారింది. ఆమె తన ఇంటర్వ్యూ కోసం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను ఎంచుకుంది. మరి ఈ స్పెషల్ టాక్ షోలో ఏమేం ఉండబోతున్నాయో చూడాల్సిందే. విజయ్ దేవరకొండతో సామ్ జామ్ ధూమ్ ధామ్ గానే జరిగినట్టుంది.
ఈ ఫొటోలు ఇప్పటికే బయటికి వచ్చాయి. విజయ్ సిల్వర్ కలర్ సూట్ ధరించి మంచి స్టయిలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ దీపావళి పెళ్లికొడుకు విజయ్ దేవరకొండే అనుకోవాలి. ఎందుకంటే విజయ్ బ్యాచ్ లర్, పైగా యూత్ స్టార్.. ప్రేమ, పెళ్లి లాంటి విషయాలను సమంత అడగకుండా ఎలా ఉంటుంది. అంతేకాదు కరోనా కాలంతో అతను వినూత్న సేవాకార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాడు.
సమాజ దృష్టి కోణంలోనే సమంత ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ఆ ప్రశ్నలనూ సమంత అడిగి తీరాల్సిందే. విజయ్ ని పిలిచి సామ్ ఎంత చిలిపిగా మాట్లాడుతుందో చూడాల్సిందే. సామ్ లుక్స్ కూడా చిలిపిగానే ఉంటాయి. సిగ్గుపడకుండా సమాధానాలు చెప్పడంలో విజయ్ కూడా దిట్టే. మంచి సరదాగానే ఈ టాక్ షో ఉండేలా ఉంది.