ఆ మాజీ భార్యా భర్తల మధ్య సమరం మొదలవ్వబోతోందా ? నువ్వా నేనా అనేలా ఇద్దరి మధ్య యుద్ధం జరగనుందా ? ఇంతకీ ఎవరా ప్రముఖులు ? వారి మధ్య ఏర్పడనున్న గొడవ ఏమిటి ? సినీ వర్గాల్లో ఆ మాజీ భార్యా భర్తల పై ఆసక్తిగా మారిన చర్చ ఏంటి ?
అక్కినేని నాగ చైతన్య, సమంత.. చక్కటి జోడీ, హిట్ పెయిర్ కూడా.. అయితే ఇది ఒకప్పటి మాట. వ్యక్తిగత కారణాలతో సామ్ , చైతు విడిపోయారు. తర్వాత ఎవరికి వారు తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే వీరి పై ఏ చర్చ వచ్చినా అది సంచలనంగా మారుతోంది. ఇక తాజాగా నెలకొన్న చర్చ కూడా అదే కోవకు చెందిందిగా కనిపిస్తోంది.
సమంత, నాగచైతన్య ఇద్దరి మధ్య యుద్ధం జరగబోతోందట. అయితే అది నిజ జీవితంలో కాదు, అలాగని సినిమాలోనూ కాదు. బాక్ ఆఫీస్ వద్ద ఇద్దరి మధ్య సమరం జరగబోతోందనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సమంత ప్రధాన పాత్రను పోషించిన
‘ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కానుండగా, నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
కేవలం ఒక్కరోజు తేడాతో సమంత, నాగచైతన్యలు నటించిన సినిమాలు విడుదల కానుండటంతో..ఈ అంశం ఫిల్మ్ సర్కిల్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది.ఇక ఇద్దరి మూవీస్ లో ఏది సక్సెస్ అవుతుందో? ఎవరు విజయాన్ని అందుకుంటారో? అనే చర్చ జోరందుకుంది.కాగా, ఇప్పటికే ఈ అంశం పై సామ్ , చైతు అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలను పోషించారు.ఇందులో నాగచైతన్య కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఇక సమంత ప్రధాన పాత్రను పోషించిన ‘యశోద’ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కాబోతోంది.దర్శకుడు హరి-హరీశ్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
మరి నిజంగానే ఈ సినిమాల్లో ఏది సక్సెస్ అవుతుందో? ఎవరు విజయాన్ని అందుకుంటారో? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.