టెన్నీస్ లో తెలుగు వారి ప్రఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది సానియా మీర్జా. పాకిస్థాన్ క్రికెటర్ ని వివాహామాడి సంచలనం సృష్టించింది. తాజాగా ఈ ప్రముఖ క్రీడాకారిణి తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక లేఖ సంచలనంగా మారింది. తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తీరు, అలాగే కెరీర్ లో ఎదురైన సవాళ్ల గురించి వివరించింది సానియా. 2020 లో డబుల్స్ విజేతగా నిలిచిన ఈ టెన్నీస్ దిగ్గజం తన లేఖను సందిగ్ధ స్థితిని ఎదుర్కొంటున్న మహిళలందరికీ అంకితం ఇస్తున్నానని పేర్కోంది.
ఇదే నా ప్రయాణం
తల్లిగా బాధ్యతలా… కోరుకున్న కలలను అందుకోవడమా… ఇలాంటి సందిగ్థత స్థితి ప్రతి మహిళ జీవితంలో ఒకానొక సందర్భంలో ఎదురవుతుంది. ఈ రోజు నేను నా జీవిత ప్రయాణాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నారు. నా ప్రయాణంలో స్ఫూర్తి దాతగా నిలచిన సెరెనా విలియమ్స్ ని గుర్తుచేసుకుని తీరాలి. నా ఈ లేఖను తమ జీవన ప్రయాణంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, తమ కలలకు అందుకోవడాని నిరంతరం పోరాడుతున్న ప్రతి తల్లికి అంకితం చేస్తున్నాను.
తిరిగి మామూలు స్థితికి రాగలమా
ఆడవారిని కేవలం వంటింటి కుందేళ్లుగా చూసే మన సమాజంలో, తమ కలలను నెరవేర్చుకునే మహిళలు చాలా అరుదుగా ఉంటారు. తల్లిగా మారిన తర్వాత కూడా కొందరు ప్రపంచ ఆలోచనను మారుస్తూ తమ లక్ష్యం దిశగా దూసుకుపోతూ ప్రపంచాన్నే నివ్వెరపరుస్తారు. ముఖ్యంగా క్రీడాకారుల్లో తల్లి కాబోతున్నాం అని తెలియగానే తిరిగి మనం ఆడగలమా అనే అనుమానాలు తలెత్తుతాయి. కానీ, అటువంటి వారందరికీ నా జీవితమే ఒక ఉదాహరణ. కచ్చితంగా తిరిగి మనం అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయగలం. తల్లిగా మారడం మన లక్ష్యాన్ని ఏమాత్రం ఆపలేదు.
సెరెనాను చూడండి
ఇదే తరంలో మన కళ్ల ముందే ఆడుతున్నా సెరెనాను ఒక్కసారి చూడండి. తన డాక్యుమెంట్రి చూస్తుంటే నాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. తన పోరాట పటిమ, సాధించాలనే తపన, తన అభిరుచి, ఎన్నో విజయాలు అందుకున్న తర్వాత కూడా ఇంకా ఎంతో సాధించాల్సంది ఉంది అన్నట్లు తను ప్రయత్నిస్తున్న తీరు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
తల్లికావడం ఒక భాగమే
ఆడవారి జీవితంలో తల్లికావడం ఒక భాగం మాత్రమే. అది అనుభవించక ముందు ఎన్నో భయాలు ఉండడం సహజం. కానీ ఒక్కసారి తల్లిగా మారిన తర్వాత మీకు పూర్తి అవగాహాన వస్తుంది. ఈ ప్రక్రియ మిమ్మల్ని పరిపూర్ణ మహిళగా మారుస్తుంది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, మీ శరీరాన్ని మీరు స్వీకరించడం నేర్పుతుంది. స్వార్థం లేని ప్రేమ విలువ తెలియజేస్తుంది. ఒక బిడ్డకు జన్మనివ్వడం మిమ్మల్ని అత్యత్తమ వ్యక్తిగా మారుస్తుంది.
మానసిక సంసిద్దత అవసరం
ఈ ప్రయాణంలో మిమ్మల్ని మీరు సంసిద్దం చేసుకోవడం చాలా అవసరం. మానసికంగా, శారీరికంగా దృఢంగా ఉండేలా మిమ్మల్ని మీరే తయారు చేసుకోవాలి. ఈ ప్రయాణంలో దాదాపు 26 కిలోలు తగ్గి తిరిగి రాకెట్ పట్టి డబుల్స్ గేమ్ గెలిచినపుడు నాకు అర్ధం అయింది. తల్లి కావడం కూడా మహిళ ప్రయాణంలో ఒక భాగమే. అది మీ కలలకు బ్రేక్ కాదు. కొన్ని సమయాల్లో ఎన్నో కఠిన మైన పరిస్థితులను ఎదుర్కొన్నాను, కానీ ఏనాడు నాకు కలలను వదులు కోవాలనే ఆలోచన చేయలేదు.
సానీయా తల్లిగా మారి, తిరిగ రాకెట్ అందుకుని విజయం అందుకున్న తీరు కచ్చితంగా స్ఫూర్తిదాయకం. సానీయా మాత్రమే తనలా అటు ఇంటిని, ఇటు ఉద్యోగంలో ఉన్నత శిఖరాలు అందుకుంటున్న వారందరికీ హ్యాట్సాఫ్.