డీఎంకే బహిష్కృత నేత శశికళ కొన్నాళ్లు రాజకీయాలకు దూరమయ్యారు. జైలు నుంచి విడుదల అయ్యాక క్రీయాశీలకంగా వ్యవహరించలేదు. తాజాగా ఆమె మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ ఆడియో క్లిప్ బయటకు రావడం, అది కాస్తా వైరల్ కావడంతో శశికళ రాజకీయ ఎంట్రీగా ఖాయంగా కనిపిస్తోంది. పార్టీని బలోపేతం చేస్తా.. అందరూ ధైర్యంగా ఉండండి. కరోనా వేవ్ తగ్గాక కచ్చితంగా వస్తానని, అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే అధినేత జయలలిత మరణం తర్వాత పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు శశికళ వైపు చూశారు. కానీ ఆమె జైలుకు వెళ్లడంతో సాధ్యపడలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీ ఓడిపోవడంతో శిశకళ రాజకీయాల్లో వస్తారనే వార్తలు వినిపించాయి.
నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!
DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్ మరోసారి తీవ్రస్థాయిలో...











