కొద్ది రోజుల్లోనే అమరావతి సచివాలయం విశాఖకు తరలిస్తారనే సంకేతాలు వస్తున్నాయి. అమరావతి నుంచి పరిపాలన సాగించడం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదట. కోర్టు కేసులు ఓ వైపు, కరోనా మరో వైపు ఉక్కిరి బిక్కిరి చేయడంతో అమరావతి రాజధాని విశాఖకు తరలింపు వాయిదా పడుతూ వస్తోంది. కోర్టు కేసులు ఇప్పట్లో తేలవనే ఉద్దేశంతో కరోనా అదుపులోకి రాగానే అమరావతి సచివాలయాన్ని విశాఖకు తరలించే పక్కా ప్రణాళిక సిద్దం అవుతోందని సమాచారం.
సచివాలయం గేట్లు తీసివేసి గోడలు కడుతోంది అందుకేనా….
అమరావతి సచివాలయం, అసెంబ్లీలకు కలపి మొత్తం 7 గేట్లు ఉన్నాయి. మూడు నెలల క్రితం వాస్తు పేరుతో రెండు గేట్లు తీసి వేసి గోడలు కట్టారు. తాజాగా మరో 2 గేట్లు తీసివేసి గోడలు నిర్మించే పనులు చేపట్టారు. అంటే ఇక లోపలకు వెళ్లడానికి బయటకు రావడానికి సచివాలయానికి ఒకగేటు, అసెంబ్లీ, మండలికి రెండు గేట్లు మాత్రమే ఉండనున్నాయి. వాస్తు పట్టింపులు హిందువులకు ఉంటాయి. ముఖ్యమంత్రి క్రిస్టియన్. అయినా వాస్తు పేరుతో గేట్లు తొలగించి గోడలు పెట్టడంపై అమరావతి రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు అమరావతిలో అడుగు పెట్టడం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని అందుకే ముందుగా 3 రాజధానుల ప్రకటన చేశారు. తాజాగా కొడాలి వ్యాఖ్యలతో విశాఖ ఒక్కటే రాజధానిగా చేయాలని సీఎం భావిస్తున్నారని తెలుస్తోంది.
డిసెంబర్ నాటికి రాజధానిని విశాఖ తరలిస్తారా?
అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. అమరావతి రాజధానిలో ఒక్క రూపాయి ఖర్చు చేసి అభివృద్ధి చేయడం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని ఆయన మైండ్ సెట్ అధ్యయనం చేసిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే మరో రెండు, మూడు మాసాల్లోనే అమరావతి రాజధానిని విశాఖకు తరలించడం ఖాయంగా కనిపిస్తోంది. కోర్టులో కేసులో నడుస్తున్నా అధికారికంగా ప్రభుత్వం రాజధాని తరలింపు పదం వాడకుండా జాగ్రత్తలు తీసుకోనుందని సమాచారం.
అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందితే జగన్మోహన్ రెడ్డికి రెండు ప్రమాదాలు
అమరావతి ప్రాంతం ఎంత అభివృద్ధి సాధించినా చంద్రబాబునాయుడు ముద్రను చెరిపివేయలేరు. దీనికి తోడు ఈ ప్రాంతంలో భూములకు మరలా ధరలు వస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కోవడం కష్టం అందుకే అమరావతి రాజధానిలో ఒక్క రూపాయి ఖర్చు చేయడానికి, కనీసం రూ.4000 కోట్లతో నిర్మించిన క్వార్టర్లు, పేదల ఇళ్లుకు సున్నం కూడా వేయించే ఆలోచన సీఎంకు లేదని స్పష్టం అవుతోంది. వైసీపీ కక్ష రాజకీయాలతో కేవలం 29 గ్రామాల రాజధాని రైతులే కాదు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని శాశ్వితంగా సమాధి అయినట్టేనని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.











