అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాము సూచించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ ప్రకాశ్ జవాడేకర్ , ప్రజల భద్రత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏఏ విధానాలు పాటించాలనే విషయాల్ని తెలియచేశారు.
50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్స్ పడపాలని, థియేటర్స్ లో శానిటైజేషన్ తప్పని సరని, అలాగే బైట ఫుడ్స్ కి అనుమతి లేకుండా కేవలం ప్యాకేజింగ్ ఫుడ్ ను మాత్రమే అనుమతించాలని, ఇంటర్వెల్ టైమ్ లో రద్దీ లేకుండా చర్యలు తీసుకోవాలని థియేటర్స్ యాజమాన్యానికి ప్రత్యేక సూచనలు చేశారు.
థియేటర్‌లో పాటించాల్సిన నియమాలు:
- 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ నడపాలి
- సీట్ల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి
- క్రాస్ మార్క్ చేసిన సీట్లలో కూర్చోకుండా చూడాలి
- హ్యాండ్ వాష్ శానిటైజర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి
- ప్రతి ఒక్కరి చేత ఆరోగ్య సేతు యాప్ ఇన్‌స్టాల్ చేయించాలి.
- థర్మల్ స్క్రీనింగ్ తప్పని సరి
- ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సెల్ఫ్ మానిటర్ చేయాలి
- మల్టీ ప్లెక్స్‌లలో స్క్రీనింగ్ టైమింగ్స్ వేరువేరుగా ఉండాలి
- ఆన్ లైన్ బుకింగ్ కే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి
- బాక్సాఫీస్, ఇతర ప్రాంతాలని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.
- ప్రేక్షకుల్ని బట్టి కౌంటర్స్ ని పెంచాలి
- ఇంటర్వెల్‌లో ప్రేక్షకులు గుమిగూడకుండా ఉండేలా చూడాలి.
- ఫ్లోర్ మేకర్స్ కూడా భౌతిక దూరం పాటించాలి.
- ఉమ్మివేయడం నిషేదం
- గాలి ఆడేలా ఏర్పాట్లు చేయాలి.
- స్టాఫ్‌కు పీపీఈ కిట్స్ లాంటివి అందించాలి.
- ఆడియన్స్ కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకోవాలి.
- వీలైనన్ని కౌంటర్స్ ఏర్పాటు చేసేలా చూడాలి.
- థియేటర్ లో ఏసీ టెంపరేచర్ 24-30 మధ్య ఉండేలా చూడాలి.
- షో ప్రారంభమయ్యే ముందు, పూర్తయ్యాక, ఇంటర్వెల్ సమయంలోను కోవిడ్ నిబంధనలకు సంబంధించి అనౌన్స్‌మెంట్ ఇవ్వాలి.
Announced the Standard operating procedures, SOP's for cinema halls, multiplexes etc. for screening of films, as they reopen from 15th of October as per Ministry of Home Affairs guidelines.#UnlockWithPrecautions pic.twitter.com/X1XZFZoDAT
— Prakash Javadekar (@PrakashJavdekar) October 6, 2020











