ఆదివారం నాడు దేవి ఎలిమినేషన్‌తో చాలా మంది ఇంటి సభ్యులు షాక్‌లోనే ఉండిపోయారు. ఇక నాలుగో వారం నామినేషన్ హీట్ ఉండటంతో ఈ వారంలో ఎవరు నామినేట్ అవుతారు?? ఇంటి సభ్యుల మధ్య రచ్చ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తితో సోమవారం నాటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇక మొనాల్-మెహబూబ్‌లు నామినేషన్స్ విషయంలో చర్చించి.. అభిని నామినేట్ చేయడానికి గట్టి రీజన్ ఉందని మాట్లాడుకున్నారు. అరియానా-అవినాష్‌లు వరసలు రొమాన్స్, కెమిస్ట్రీపై ఫన్నీ చర్చలు జరిపారు. ఇక కుమార్ సాయిని లూజ్ అనడంపై అభితో చర్చించింది దివి. నువ్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటావు.. సడెన్‌గా సీరియస్ అయిపోతావ్.. అని అనడంతో ‘నేను నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు.. నేనే ఏంటో నాకు తెలుసు.. నిన్ను నామినేట్ చేసినా ఆశ్చపోవాల్సిన పనిలేదు’ అని చెప్పాడు అభి.
దీంతో నువ్ నాకు అర్థం కావాల్సిన అవసరమే లేదు.. నువ్వే కాదు.. నేను కూడా నిన్ను నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నా.. ఇది క్లియర్’ అని ట్విస్ట్ ఇచ్చింది దివి. ఇక ఈవారం నామినేషన్స్‌లో భాగంగా సొహైల్-అఖిల్ ఇద్దరూ హిట్ మెన్‌లుగా ఉంటారని.. ఈ ఇద్దరికీ ఒక డెన్ ఉంటుందని.. వాళ్లకు తలో ఐదు వేలు ఇచ్చారు బిగ్ బాస్. అలాగే ఇంటి సభ్యులందరికీ తలో పది వేలు ఇచ్చారు. బజర్ మోగిన ప్రతిసారి మొదటిగా హిట్ మెన్‌లు ఉండే డెన్‌కి వెళ్లి.. ఎవర్ని షూట్ చేయాలో చెప్పి డీల్ కుదుర్చుకోవాలని చెప్పారు. మొత్తం ఐదు బజర్లు మోగుతాయి.. మోగిన ప్రతిసారి ఇంటి సభ్యులు పోటీ పడి డెన్‌కి వెళ్లాలని అలా వెళ్లిన వాళ్లు సేవ్ కావడంతో పాటు ఒకర్ని నామినేట్ చేయొచ్చని చెప్పారు బిగ్ బాస్.
నాలుగోవారం నామినేషన్స్‌కి హారిక, స్వాతి దీక్షిత్, అభిజిత్, లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సొహైల్ ఏడుగురూ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. అయితే ప్రతివారం మాదిరే ఈ వారం కూడా సిల్లీ రీజన్‌తో సుజాత కుమార్ సాయిని.. హారిక మొహబూబ్‌ని నామినేట్ చేశారు. ఇక స్వాతి దీక్షిత్ బయట గేమ్ చూసి వచ్చిందని ఎక్కువగా అభిజిత్‌తోనే మాట్లాడుతుందని ఆమె ఎవరితో మాట్లాడాలో ఏంటో ఫిక్స్ అయ్యి వచ్చిందని సొహైల్-మొహబూబ్‌లు చర్చించుకున్నారు. ఒక పక్క వీళ్లు అభి-స్వాతిల గురించి మాట్లాడుతుంటే మరోపక్క వాళ్లిద్దరూ ఎప్పటిలాగే ముచ్చట్లు పెట్టారు.
కొత్తగా వచ్చిన స్వాతి దీక్షిత్ కూడా మొనాల్, హారికలతో పోటీ పడుతూ పులిహోరా రాజా ట్యాగ్‌ని పదిలం చేసుకున్న అభితోనే బాండింగ్ ఏర్పరచుకుంటుంది స్వాతి. అయితే ఎలాగూ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది కాబట్టి ఆమె నామినేషన్‌లో ఉన్నా ఏదో పర్పస్‌తో తెచ్చి ఉంటారు కనుక ఆమె ఈవారం నామినేషన్‌లో ఉన్నా అంత తొందరగా అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఆమెతో పాటు అభి ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా సేవ్ చేయొచ్చు. ఇక మిగిలిన ఐదుగురు హారిక, లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సొహైల్‌లో ఒకరికి ప్రమాదం పొంచి ఉంది. ఈ వారం బిగ్ బాస్ లో ఏంజరుగుతుందో చూడాలి మరి.











