తలుగు తెరకు పరిచేయమవుతూనే వరుస ఆఫర్స్ తో టాప్ హీరోయిన్స్ సైతం ఈర్ష్య పడేలా చేస్తోంది టీనేజ్ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో బుజ్జమ్మగా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తన క్యూట్ నెస్ తో అందరినీ కట్టిపడేసింది.ఇండస్ట్రిలోకి అడుగుపెడుతూనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని చాలా తేలికగా హ్యాట్రిక్ అందుకున్న ఈ అమ్మడు తెలుగు , తమిళంలో భారీ ఆఫర్స్ అందుకుంటోంది.తాజాగా కృతి తెలుగు, తమిళ్ ఇండస్ట్రిల్లోని స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిందట.దీంతో కృతి స్టార్ హీరోయిన్స్ కి చెక్ పెట్టేసిందనే టాక్ సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ కృతి ఏ స్టార్ హీరోలతో రొమాన్స్ చేయబోతోంది తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ దూసుకోపుతున్న నటి కృతి శెట్టి. వెండితెరకు పరిచయమైన కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈ బ్యూటీ.ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ అమ్మడు ఇటు తెలుగు, అటు తమిళ సినిమాల్లో భారీ ఆఫర్స్ అందుకుంటోంది. ఈ క్రమంలోనే కృతి స్టార్ హీరోయిన్స్ కి చెక్ పెట్టేస్తోందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.
ఇప్పటికే తెలుగులో సుధీర్ బాబు సరసన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” చిత్రంలో నటిస్తున్న కృతి, నితిన్ కి జంటగా ” మాచర్ల నియోజకవర్గం”, రామ్ పోతినేని సరసన “ది వారియర్” మూవీల్లో నటిస్తోంది. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు సైతం కృతి హోల్డ్ లో ఉన్నాయట. ఈ క్రమంలోనే తమిళంలో ఈ అమ్మడు గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోందట. విలక్షణ దర్శకుడు బాలా – స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టబోతోందట ఈ చిన్నది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కృతి తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. ధనుష్ హీరోగా అరుణ్ మాధ్యరేశ్వరన్ ఓ చిత్రాన్ని రూపొందిస్తుండగా అందులో హెరోయిన్ గా కృతిని కన్ఫర్మ్ చేశారట. తొలత ఈ సినిమా కోసం ప్రియాంక అరుళ్ మోహన్ ని అనుకున్నారట. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ కృతిని వరించాయని కోలీవుడ్ వర్గాల సమాచారం.
అదేసమయంలో నాగచైతన్యతో మరోసారి ఈ అమ్మడు జాతకట్టబోతోందట. చై హీరోగా వెంకట్ ప్రభు ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. కెరియర్ పరంగా చైతూకి ఇది 22వ సినిమా. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. ఇటీవలే ఆ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది. ‘బంగార్రాజు’ తరువాత చైతూ .. కృతి కలుసు నటిస్తున్న సినిమా ఇది.
మొత్తం మీద ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో కృతి టైమ్ బాగా నడుస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆమె ఇటు తెలుగు, అటు తమిళ్ ఇండస్ట్రిలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయారనే చెప్పుకోవచ్చు.