సినీ ఇండస్ట్రి అంటేనే రూమర్స్ కి కేరాఫ్ గా చెప్పుకోవచ్చు.ఇండస్ట్రిలోని వ్యక్తులపై ఎప్పుడూ ఏదో ఒక గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. వారిపై వచ్చే ఏ వార్తలు అయిన ఆసక్తికరంగా చూస్తుంటారు ప్రేక్షకులు.గత కొద్దికాలంగా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ , హీరోయిన్ ఛార్మి మధ్య ఏదో నాడుస్తోందనే కథనాలు జోరుగా వీపిస్తున్నాయి. ఇక పూరీ పెట్టిన నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ ద్వారా ఛార్మి తో కలిసి ఆయన సినిమాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి బయట పార్టీల్లో సైతం కనిపిస్తుండడం వీరిపై వస్తున్న పుకార్లకు బలాన్ని చేకూరుస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వీరిపై గాసిప్ రాయుళ్ళు అనేక కథనాలు అల్లేశారు. ఏకంగా పూరీ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడంటూ వార్తలు రాసుకొచ్చారు.దీంతో ఆ మధ్య ఈ అంశం కాసింత దుమారమే రేపిందనే చెప్పుకోవచ్చు.
అయితే తాజాగా పూరీ, ఛార్మి ల మధ్య ఎఫైర్ నాడుస్తోందంటూ వస్తున్న రూమర్స్ పై పూరీ తనయుడు, యంగ్ హీరో ఆకాశ్ పూరీ స్పందించాడు. ‘మా నాన్న సినిమా ఇండస్ట్రిలోకి వచ్చాక తన కెరీర్ లో చాలానే నష్టపోయాడు. మా అమ్మకు నాన్న పరిస్థితి ఎలా ఉందో అర్ధమయ్యింది. పిల్లలం కాబట్టి మాకు ఆ విషయాలు తెలియకూడదు అని నన్ను, మా చెల్లిని హాస్టల్ కి పంపించేసింది.మేము హాస్టల్ కి వెళ్ళేటప్పటికి నేను మూడో తరగతి చదువుతున్నాను. మా నాన్న పెద్ద డైరెక్టర్, అంతా హ్యాపీగానే ఉంటుంది అని నేను చెల్లి అనుకున్నాం. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటనేది కొన్నాళ్ల తర్వాత మాకు అర్థమైంది.ఒక్కసారిగా మేము వేసుకునే బట్టల నుంచి, తినే తిండి, ఉండే చోటు వరకు అంతా మారిపోయింది. మా ఆర్ధిక పరిసతిహతుల వల్ల మేము ఉంటున్న ఇల్లు, కార్లు కూడా అమ్మేశాం.ఆ సమయంలో దాదాపు ఐదారేళ్ల పాటు నరకం చూశాం. కానీ మా నాన్న మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడం మాత్రం మామూలు విషయం కాదు. మా ఫ్యామిలీ ఇప్పుడిలా ఉందంటే కారణం మా అమ్మే.
ఇక మా అమ్మానాన్న విడాకులు తీసుకుంటారన్న వార్త నేనైతే ఇంతవరకు ఎప్పుడూ వినలేదు.మా అమ్మే నాన్నకు పెద్ద సపోర్ట్.నిజానికి అమ్మా నాన్నలాది లవ్ మ్యారేజ్.ఎవరో కొందరు ఏ పని లేక టైంపాస్ కాక మా మమ్మీ డాడీ విడాకులు తీసుకుంటున్నారంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తూనే ఉంటారు. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. ఇక్కడ మీకో నిజం చెప్తాను.. మా మమ్మీ వాళ్ళు లవ్‌లో ఉన్న సమయంలో నాన్న అమ్మకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం, వస్తావా? అని అడిగాడట.అమ్మ కూడా హా, వచ్చేస్తానని చెప్పిందట.దానికి నాన్న.. నా జేబులో కేవలం 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మరి రేపు ఎలా ఉంటుందో కూడా నేను చెప్పాలను పర్వాలేదా ,ఇప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడట.దానికి అమ్మ క్షణం కూడా ఆలోచించకుండా చేసుకుంటానని వచ్చేసిందట.ఈ విషయాన్ని అమ్మా వాళ్ళు మాతో చెప్పినప్పుడు..నిజంగా ఇంతలా ప్రేమించేవాళ్లు ఉంటారా? అనిపించింది’ అని ఆకాశ్ చెప్పుకొచ్చాడు.