గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ అంకులు హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. డ్రైవర్ మస్తాన్ వలితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది. అంకులు హత్య కేసులో దాచేపల్లి ఎస్‌ఐ బాలనాగిరెడ్డిపైనే ఆరోపణలు రావడంతో అధికారులు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాయి.
అంకులుకు ఫోన్ చేసింది ఎవరు
పెదగార్లపాడులో ఉన్న మాజీ సర్పంచ్ అంకులు హత్య జరిగిన రోజు సాయంత్రం దాచేపల్లి అర్జెంటుగా రావాలని ఫోన్ చేసింది ఎవరనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంకులు హత్య పోలీసులకే చుట్టుకోవడంతో వారు ఈ హత్యను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పెద్దగార్లపాడు గ్రామంలో గతంలోనూ నలుగురు హత్యకు గురయ్యారని పోలీసులు గుర్తు చేస్తున్నారు. అంకులు హత్యలో పోలీసుల పాత్ర లేదని తేల్చే పనిలో ప్రత్యేక బృందాలు దర్యాప్తును కొనసాగిస్తున్నాయని తెలుస్తోంది.
Also Read: నిన్న అత్త.. నేడు అల్లుడు.. దందాలే దందాలు!