డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘ఫైటర్’ మూవీ కరోనా కారణంగా ఆగింది. ఈ సినిమాని పూరి – ఛార్మి – కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముంబాయిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే.. కరోనా రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. కరోనా తగ్గి మిగిలిన సినిమాల షూటింగ్ లు స్టార్ట్ అయ్యాయి కానీ.. ఫైటర్ మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు.

దీంతో ‘ఫైటర్’ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం కొంత మంది విదేశీ ఫైటర్స్ అవసరం. వాళ్లతో కీలక సన్నివేశాలను చిత్రీకరించాలి. అయితే.. కరోనా విదేశాల్లో తగ్గకపోవడం వలన షూటింగ్ స్టార్ట్ చేయయలేదు. దానివల్లనే ‘ఫైటర్’ సినిమా ఆగిపోయిందని… విజయ్ మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నాడని.. టాలీవుడ్ లో టాక్ వినిపించింది.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ నెల 20 నుంచి ‘ఫైటర్’ సెట్స్ పైకి వస్తుందని తెలిసింది. అయితే.. ముంబాయిలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేస్తారా.? లేక హైదరాబాద్ లోనా అనేది తెలియాల్సివుంది. ఎట్టి పరిస్థితుల్లోను ‘ఫైటర్’ మూవీని సమ్మర్ కి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. పూరి స్పీడు గురించి తెలిసిందే. ఒకసారి స్టార్ట్ చేస్తే.. ఇక కంప్లీట్ అయ్యే వరకు ఆపరు. సో.. ఫైటర్ సమ్మర్ కి థియేటర్ లోకి రావడం ఖాయం. మరి.. ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన పూరి అదే ఫామ్ కంటిన్యూ చేస్తారేమో చూడాలి.











