(విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ప్రభుత్వం నిర్ణయాలు.. మద్యనిషేధాన్ని లక్ష్యించినట్లుగా ఎంతగా ప్రచారం జరుగుతోందో.. అంతకు మించి.. స్మగ్లింగ్ ను పెంచిపోషిస్తున్నాయి. దొరికే వారు దొరుకుతున్నారు. దొరకని వారు యథేచ్ఛగా మద్యం స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు. ఇంతకీ పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం స్మగ్లింగ్ రవాణా చేయడానికి వారు ఎంచుకుంటున్న మార్గాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. రోడ్డు మార్గంలో తెస్తోంటే దొరికిపోతున్నామనే భయంతో కొరియర్ ను ఆశ్రయించడం తాజా ట్విస్టు.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు.. మద్యం వ్యాపారులు రకరకాల జిమ్మిక్ లతో అడ్డగోలుగా తమ వ్యాపారం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా మద్యపానాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో ధరలు భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. అనూహ్యంగా 75% మద్యం ధరలు పెరగడంతో మందుబాబులు, వ్యాపారులు పొరుగు రాష్ట్రాల పై దృష్టిసారిస్తున్నారు. అక్రమ మార్గంలో మధ్యలో ఎలా దిగుమతి చేసుకోవాలి అన్న దానిపై రకరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

ఈ ప్రయత్నాల్లో భాగంగా గాజువాక కు చెందిన ఓ ముఠా ఏకంగా కొరియర్ సంస్థనే సంస్థను వాటేసుకుంది. ఎవరికి అనుమానం రాదని ఈ మార్గాన్ని ఎంచుకుంది. వారు ఊహించినట్టుగానే రెండు నెలల పాటు సజావుగా సాగిన వీరి వ్యాపారానికి ఎట్టకేలకు ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు చెక్ పెట్టారు.
అక్రమ మద్యం వ్యాపారాన్ని సక్రమంగా చేస్తున్న ఎనిమిది మందిలో ఆరుగురిని అరెస్టు చేశారు. గాజువాక ప్రాంతానికి చెందిన ఏ. సుబ్బిరామిరెడ్డి, యూ. రమణారెడ్డి కలిసి మద్యం అక్రమ వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన స్క్రాప్ వ్యాపారి కే హరీష్ తో వీళ్లకు పరిచయం ఏర్పడింది. తెలంగాణ నుంచి విశాఖకు మద్యం పంపించేందుకు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. విశాఖలోని ద్వారకా నగర్ ప్రాంతానికి చెందిన ఓ కొరియర్ సర్వీస్ యజమానితో డీల్ కుదుర్చుకున్నారు. ఇలా రెండు నెలలుగా కొరియర్ ద్వారా మద్యం డెలివరీ అవుతోంది. వచ్చిన సరుకును ఒకచోట భద్రపరిచి అనధికార దుకాణాలకు, బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో క్వార్టర్ బాటిల్ 95 రూపాయలకు లభిస్తే, అదే అదే ముందు విశాఖలో 160 నుంచి డిమాండ్ ను బట్టి 250 రూపాయలకు విక్రయిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో పాతిక రూపాయల కు లభించే మద్యం ఆంధ్ర రాష్ట్రం లో వంద రూపాయలు వెచ్చించాల్సి రావడం తో అనేకమంది అక్రమంగా మద్యం సరఫరా కు తెగబడుతున్నారు. మద్యపాన నిషేధ సమయంలోనూ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి. పొరుగు రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా మద్యం బాటిల్ దిగుమతి చేసుకునేవారు.
ప్రభుత్వాదాయానికి గండి
ప్రస్తుతం ఏపీలో ఇస్తున్న ధరల కారణంగా కొనుగోలుదారులు, విక్రేతలు వక్రమార్గం పడుతున్నారు. మద్యపాన నిషేధం మాటల ఉంచితే, రాష్ట్రానికి దక్కాల్సిన ఆదాయం కూడా పొరుగు రాష్ట్రాలకు రాష్ట్రాల ఖాతాలో చేరిపోతోంది. నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పక్క రాష్ట్రం నుంచి మద్యం దిగుమతి అవుతూనే ఉంది. మరోవైపు ఎక్కువ మొత్తంలో మద్యం కోసం డబ్బులు ఖర్చు చేయలేని దినసరి కూలీలు, అల్పాదాయ వర్గాలు శానిటైజర్ లు, స్పిరిట్ లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించాలని ఆలోచన చేస్తోంది. ఏపీలో మద్యం ధరలు తగ్గితే ఈ అడ్డగోలు వ్యవహారానికి తెర పడుతుందేమో వేచిచూడాలి.
నాటుసారాకు రెక్కలు
నాటుసారా తయారీకూడా విపరీతంగా పెరుగుతోంది. ప్రభుత్వం ధరలు పెంచడంతో పాటు ఊరూపేరూ లేని బ్రాండ్ల మద్యాన్ని అధికధరలకు విక్రయిస్తుండగా.. దానికంటె నాటుసారా బెటర్ అనుకుంటున్న మందుబాబులు ఎక్కువగా ఉంటున్నారు. లిక్కర్ స్మగ్లర్ల మాదిరిగానే నాటుసారా కాసేవారు కూడా ఒకటీ అరా కేసుల్లో పట్టుబడుతున్నారే తప్ప.. ఆ దందా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వం ఈ స్మగ్లింగ్ ను గానీ, నాటుసారాను గానీ కట్టడి చేయలేని స్థితిలో ఉందనే విమర్శలు వస్తున్నాయి.











