రాజకీయాల్లోకి వస్తా అంటున్న సోనూ సూద్..!
ప్రస్తుత రోజులు కోవిడ్ కు ముందు, తరువాత అంటూ విడదీసి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే కోవిడ్ కష్టకాలంలో దేశ వ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు తమకు చేతనైన సాయం అందించాయి. ఈ నేపధ్యంలోనే సిని నటుడు సోనూ తనదైన సామాజిక దృక్ఫథం చేసిన సేవా ప్రసంశలు అందుకుంది. వలన కార్మికుల పాలిట దేవుడిలా మారి, ఆయన చేసిన సేవలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలానే సోషల్ మీడియాలో అడిగిన వారికి లేదనుకుండా సాయం చేసి, తన సహృదయాన్ని చాటుకున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా సోనూసూద్ రాజకీయాల్లో వస్తున్నారని నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్ కు ఆయన క్లారిటీ ఇచ్చారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నానని, ఏ పార్టీలో చేరి, ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్నది అభిమానులతో పంచుకునే రోజు ఒకటి వస్తుందని చెప్పుకొచ్చారు.
పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుగా సోనూ..!
సోనూసూద్ గతంలో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పనితీరును మొచ్చకున్నారు. అప్పట్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని అంతా భావించారు. అదే సమయంలో మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. దీంతో ఆయనను కేంద్రం టార్గెట్ చేసింది. ఆయన సంస్థలపై ఐటీ రైడ్స్ జరిపి, తన వ్యాపారాలు మూసివేయాలని హెచ్చరించింది. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో సోనూకు మద్దతుగా, బీజేపీకి వ్యతిరేకంగా నెటిజన్లు ట్రోల్స్ మొదలుపెట్టారు. అయితే తాను ఇప్పుడు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో దిగడంలేదని, దానికి తగినంద టీం తన వద్ద లేదన్నారు. త్వరలో జరగబోయే సాధరణ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తానని చెప్పారు. మరోవైపు తనకు చాలా పార్టీలు రాజ్యసభ సీటు, ఇతర ఉన్నత పదవులు ఇస్తామంటూ ఆఫర్ చేశాయని సోనూ చెప్పుకొచ్చారు. ఇంకోవైపు పంజాబ్ లో జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచాడు. తన సోదరి తరఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. తక్కువ సమయంలో పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ మంచి పేరు తెచ్చుకున్నారని, కాబట్టి ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లును విజ్ఞప్తి చేశారు. మోగా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన సోదరి మాళవికను గెలిపించాలని సోనూ ఓటర్లుకు విన్నవించారు.
Must Read:-రాజకీయాల్లోకి సోనూ సూద్ అరంగేట్రం! క్లారిటీ ఇచ్చిన రియల్ హీరో!!










