మాస్ మహారాజ్ రవితేజ – డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ క్రాక్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో.. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఇందులో రవితేజ్ పర్ ఫార్మెన్స్ మాస్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు పలువురు దర్శకనిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
ఇంతకీ క్రాక్ మూవీ హిందీ రీమేక్ లో ఎవరు నటించనున్నారంటే.. సోను సూద్ పేరు వినిపిస్తోంది. టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి టాలెంట్ యాక్టర్ అనిపించుకున్నారు. ముఖ్యంగా అరుంధతి సినిమాలో పశుపతి పాత్రలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇక లాక్ డౌన్ విపత్కర పరిస్థితుల్లో లక్షలాది మందికి అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు.
దీంతో సినీ అభిమానులు సోను సూద్ ని విలన్ రోల్స్ కంటే పాజిటివ్ రోల్స్ లో చూడాలని కోరుకుంటున్నారు. అందుకనే దర్శకులు సైతం సోనుకి వచ్చిన ఇమేజ్ దృష్ట్యా పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను డిజైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనుసూద్ క్రాక్ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంతో సోనుసూద్ బాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టాలి అనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే రీమేక్ రైట్స్ కోసం ప్రొడ్యూసర్ ఠాగూర్ మధుతో చర్చలు జరుపుతున్నాడని టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. క్రాక్ రీమేక్ లో సోను హీరోగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు.