సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు సంబంధించిన ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘సామ్ జామ్‘ టాక్ షో కు హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఒక పక్క సినిమాలతో బిజీగా ఉన్న సమంత మరో వైపు ‘సామ్ జామ్’ చేయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. ఇప్పటికే ఆమె రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ వంటి స్టార్లను ఇంటర్వ్యూ చేశారు. ఈ షో లకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘సామ్ జామ్’ టాక్ షో కు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను అతిధిగా ఆహ్వానించారు సమంత.

Must Read ;- చాలా గ్యాప్ తర్వాత షూటింగ్ లో సామ్
తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్ళు అవుతున్నా ఇంకా తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అసలే తమన్నా చలాకీతనం గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. అలాంటి తమన్నాతో సమంత కలిస్తే వారి అభిమానులకు, ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఇక ‘సామ్ జామ్’ లో తళుక్కున మెరిసిన తమన్నా, తన ధరించిన ఫ్యాషన్ దుస్తులతో ప్రేక్షకులను కట్టిపడేసిందనే చెప్పాలి. తమన్నా ధరించిన దుస్తులపైనే ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
తను వేసుకువచ్చిన బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో ఆమె ఒక అతిలోకసుందరిలా ఉందని ఆమె అభిమానులు అంటున్నారు. ఇంతకీ ఆమె వేసుకున్న డ్రెస్ వివరాల్లోకి వెళితే అవి మెటాలిక్ ఫెబ్రీక్ తో చేసినవి అని తెలుస్తోంది. ఆ మెటీరియల్ తో చేసినవి గనుకే దుస్తులకు మెరిసే రూపం వచ్చింది. ఇంకా ఆమె ధరించిన షర్ట్ క్రిస్ప్ మరియు కాలర్ బటన్స్ ఉన్నాయి. అలాగే ఆమె కాళ్లకు మెటాలిక్ హీల్స్ వేసుకొని మెరిసిపోయింది. ఇక జుట్టు విషయానికి వస్తే మధ్యలోకి విడిపోయిన పోనీటైల్ ను వేసుకొని అందంగా కనిపించింది. తమన్నా ధరించిన దుస్తులతో ఫ్యాషన్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కడం ఖాయం అని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు.
మరోవైపు సమంత కూడా ఏమి తక్కువ కాదు అన్నట్టే ఉంది. ఆమె కుడా ‘వి’ షేప్ లో పూర్తి స్లీవ్లు ఉన్న టాప్ ను ధరించారు. అలాగే టాప్ కు తగ్గ మేచింగ్ తో పొడుగాటి ప్యాంటు వేసుకున్నారు. ఆమె డ్రెస్ కు సరిపోయే గోల్డ్ కలర్ స్టడ్స్ చెవులకు పెట్టుకున్నారు. కాళ్లకు మెటాలిక్ హీల్స్ ధరించారు. సమంత కూడా తను వేసుకున్న దుస్తులలో మంచి ఫ్యాషన్ కనబరిచింది.
Also Read ;- రిసెప్షన్ వేడుకలో యువరాణిలా మెరిసిన మెగా డాటర్ నిహారిక

ఇక కార్యక్రమం విషయానికి వస్తే ఇందులో సమంత పలు చిలిపి ప్రశ్నలు అడిగింది. వాటికి తమన్నా కూడా అంటే క్యూట్ గా సమాధానాలు చెప్పింది. ప్రశ్నలు, జవాబులు ఎలా ఉన్నా వారిద్దరి అభిమానులు, ప్రేక్షకులు మాత్రం వారు ధరించిన ఫ్యాషన్ దుస్తులపైనే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అంతలా ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు సమంత, తమన్నా.
Also Read ;- ఆకాశమంతటి ఆత్మస్థైర్యం (జయలలిత వర్ధంతి నేడు)











