వీజే చిత్ర, నిన్న ఆర్య బెనర్జీ.. మరణాలు ఎన్నో ప్రశ్నలను మనముందు ఉంచుతున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు కళా రంగంలో ఏంజరుగుతోంది? అనే ప్రశ్న ఉద్భవించక మానదు. కళారంగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో రావూరి భరద్వాజ రాసిన ‘పాకుడు రాళ్లు’ నవల చదివితే అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తుల కథలు చివరికి ‘డర్టీపిక్చర్’ గా మనముందుకు వస్తుంటాయి. సినిమాల్లో, సీరియల్స్ లో నటించి చివరికి వాటినే మనకు మిగిల్చి అర్ధాంతరంగా జీవితాలు ముగించేసుకుంటున్న నటీమణులు చరిత్రలో మనకు ఎంతోమంది కనిపిస్తారు. చిత్ర మరణాన్ని మరువకముందే ఆర్య బెనర్జీ అనే నటి చనిపోయింది.
‘ది డర్టీ పిక్చర్’ వంటి అనేక బాలీవుడ్ చిత్రాల్లో ఆమె నటించింది. దక్షిణ కోల్ కతాలోని అపార్ట్ మెంట్ లో బెడ్ రూమ్ లో ఆమె మృతదేహం కనిపించింది. తమిళ టీవీ నటి చిత్ర బాత్ రూమ్ లో ఉరేసుకుని కనిపించింది. ఆర్య బెనర్జీ వయసు 33 ఏడేళ్లు అయితే, చిత్ర వయసు 28 ఏళ్లే. ఇంత చిన్న వయసులోనే వీరి జీవితాలు ఎందుకు ముగిసిపోయాయో అర్ధం కాదు. ప్రముఖ సితార విద్వాంసుడు నిఖిల్ బందోపాధ్యాయ కుమార్తె ఆర్య బెనర్జీ. ముంబయిలో మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ఫోరెన్సిక్ రిపోర్టులు వస్తేగాని ఆర్య మరణం వెనక ఉన్న చిక్కుముడి విడిపోదు. చిత్ర మరణం మాత్రం ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు చెబుతున్నారు. కాకపోతే ఈ రెండూ అనుమానాస్పద మరణాలే.
Must Read ;- తమిళ నటి చిత్ర మరణంపై అనేక అనుమానాలు
చిత్ర మొహం మీద గాట్లు ఎలా వచ్చాయి?
చిత్రది హత్యనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆర్థికపరమైన లావాదేవీలు కూడా ఈమె మరణానికి కారణమని తెలుస్తోంది. ఆమెను భర్త హేమంత్ కొట్టి చంపాడని చిత్ర ఆరోపిస్తోంది. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ఆమెది ఆత్మహత్య అని పోలీసులు అంటున్నారు. మరో విషయం ఏమిటంటే ఆ హోటల్ కు చిత్ర కోసం ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా వచ్చాడని అంటున్నారు. ఈ కేసులో చిక్కుముడి విడిపోవాలంటే సీసీటీవీ ఫుటేజే ఆధారం. ఆమె చనిపోయే ముందురోజు షూటింగులో పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ నాలుగు రోజులుగా ఆమె హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదన్న వాదన కూడా ఉంది. కేసును ఏదో విధంగా మాఫీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు చిత్ర బంధువులు ఆరోపిస్తున్నారు.
ఆర్య బెనర్జీకి అంత పాపులారిటీ లేకపోయినా చిత్రకు మాత్రం తమిళనాట మంచి క్రేజ్ఉంది. ముఖ్యంగా విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండ్యన్ స్టోర్స్ లోని ముల్లా పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడీ పాత్రను ఎవరు పోషించబోతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. నటి శరణ్య పేరు వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆమె ఖండించింది. తాను ఆ పాత్ర చేయబోవడం లేదని పేర్కొంది. ఈ పాత్ర ఒక్క చిత్ర మాత్రమే చేయగలిగేది, వేరొకరు చేసినా అభిమానులు జీర్ణించుకోలేరు అనే అభిప్రాయంలో శరణ్య ఉంది. మొత్తానికి ఈ ఇద్దరు నటీమణుల మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read ;- సంపాదకీయం : ఆత్మహత్య వైపు నడిపించేవి ఏవి?