రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం.. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ సుకుమార్ తో మూవీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బన్నీ స్నేహితుడు కేదార్ నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇటీవల మారేడుమిల్లిలో షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే.. టీమ్ లో కొంత మంది కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ఆగింది. ఈ మూవీని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి విజయ్ తో సినిమాని స్టార్ట్ చేయాలనేది సుకుమార్ ప్లాన్. అయితే.. విజయ్ తో సుకుమార్ మూవీని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి కథ ఏంటి..? ఇది ఏ తరహా చిత్రం..? తెలంగాణ పోరాటం గురించి సుకుమార్ గతంలో సినిమా చేయాలి అనుకున్నారు. అది ఇదేనా..? లేక వేరే కథతో సినిమా చేయనున్నాడా..? అంటూ ఆరా తీస్తున్నారు సినీజనాలు.
అయితే.. ఈ క్రేజీ మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఇండియా, పాకిస్థాన్ విభజన జరిగినప్పుడు అప్పటి పరిస్థితులు ఆధారంగా రాసిన ఎమోషనల్ డ్రామా అని.. ఇండియాకి, పాకిస్థాన్ కి యుద్ధం జరిగినప్పుడు ఒక జవాన్ విజయం కోసం ఎంత గొప్పగా పోరాటం చేశాడు అనేదే ఈ కథ. ఇందులో విజయ్ దేవరకొండ జవాన్ గా నటించనున్నారని.. ఈ మూవీకి దాదాపు 150 కోట్లు బడ్జెట్ అవుతుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్న ఇదే స్టోరీనా..? లేక వేరే స్టోరీనా అనేది తెలియాల్సివుంది.
Must Read ;- వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలుకానున్న రెబల్ స్టార్ ఫాంటసీ మూవీ











