ఓ వైపు తెలుగు, మరో వైపు తమిళ్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ సమంత. అలాగే సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తుంది. అంతేనా.. ఆహా ఓటీటీ కోసం సామ్ జామ్ అనే పొగ్రామ్ కి హోస్ట్ గా కూడా చేస్తుంది. సామ్ జామ్ పొగ్రామ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. త్వరలో సామ్ జామ్ పొగ్రామ్ లో నాగచైతన్యను కూడా ఇంటర్ వ్యూ చేయనుంది. రీసెంట్ గా మిల్కీబ్యూటీ తమన్నాను ఇంటర్ వ్యూ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరంలో తెలుగులో 96 మూవీ రీమేక్ జానుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Must Read ;- దర్శకేంద్రుడికే.. ఆ హీరోయిన్ నో చెప్పిందా.?
ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమంత కెమెరా ముందుకు రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఓ సినిమా షూటింగ్ కి ఓకే చెప్పిందని తెలిసింది. ఇంతకీ.. ఏ సినిమా అంటే.. తమిళ సినిమా. ఈ మూవీ టైటిల్ కాతువాకుల రెండు కాదల్. దీనికి విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, సమంత కథానాయికలు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్లాన్ చేసారు. డిసెంబర్ 14 నుంచి సమంత ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానుందని తెలిసింది. ఈ సినిమాతో పాటు సమంత మరో తమిళ సినిమాకి కూడా ఓకే చెప్పింది.
అది ఓ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం స్టార్ట్ కానుంది. ఈ రెండు సినిమాలకు డేట్స్ ఇవ్వడం వలనే రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో రూపొందునున్న మూవీకి నో చెప్పాల్సివచ్చింది. అలాగే సమంతతో సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఓ బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మింనుందని టాక్ వచ్చింది. అయితే.. ఈ సినిమా విషయంలో సమంత ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట. త్వరలోనే మరో సినిమాను ఫైనల్ చేయనున్నట్టు సమాచారం.
Must Read ;- అక్కినేని ఓటీటీని ఎవరు ప్లాన్ చేస్తున్నారు?