డిసెంబర్ 9వ తేదీన నాగబాబు ముద్దుల కూతురు నిహారికకు, విజయవాడకు చెందిన చైతన్య జొన్నలగడ్డకి రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలస్ లో ఘనంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబంతో పాటు ఇతర సన్నిహితులు కూడా హాజరైయ్యారు. కేవలం 120మంది సభ్యుల మధ్య నిహారిక – చైతన్య వివాహం జరిగింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే పెళ్ళికి హాజరవ్వని వారి కోసం ఇటీవల గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని నవ వధు వరులను ఆశీర్వదించారు. జేఆర్సీ ప్రాగణంలో కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోని జరిపిన ఈ వేడుకల్లో వధు వరులు మెరిసిపోతూ కనపడ్డారు. రిసెప్షన్ లో ఆకుపచ్చ లెహంగా ధరించిన వధువు నిహారిక యువరాణి లాగే ఉందని చెప్పాలి. ప్రత్యేకంగా ఆమె కోసం ఈ డ్రెస్ డిజైన్ చేశారు. ఇక్క మరో హైలైట్ అయిన విషయం ఏమిటంటే ఆమె కుందన్ డిజైన్ తో చేసిన బంగారు ఆభరణాలు ధరించారు. ఆ ఆభరణాలు ధరించడంతో రిసెప్షన్ కే కొత్త కళ వచ్చింది.
అలాగే వరుడు చైతన్య కూడా తను వేసుకున్న దుస్తులలో ఒక యువరాజులా మెరిసిపోయాడు. ఇందుకు సంబంధించిన పోటోలను స్వయంగా నిహారిక తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రిసెప్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా రియాక్ట్ అవుతున్నారు. నూతన వధు వరులకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిండు నూరేళ్ళు వారి వివాహ బంధం హాయిగా సాగిపోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
Must Read ;- నిహారిక, చైతన్యలది.. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా?











