ఏపీలో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి .. గత నాలుగేళ్లుగా అరాచక పాలనా సాగిస్తున్న జగన్ సర్కార్ కి పడమర దారి చూపించడానికి .. ఫ్యాన్ రెక్కలు విరవడానికి ప్రజలు సిద్ధంగ ఉన్నారు .. ఇప్పటికే మూడు పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి . ఒక్క ఛాన్స్ అంటూ జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ , మరో ఛాన్స్ అంటూ వైసీపీ నుండి జగన్మోహన్రెడ్డి, లాస్ట్ ఛాన్స్ అంటూ టీడీపీ నుంచి చంద్రబాబు పోటీ చేయనున్నారు. అయితే జగన్ కి మరో ఛాన్స్ దక్కే ఛాన్స్ ఏ మాత్రం కనిపించడం లేదు . వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు, ప్రస్తుతం అమలవుతున్న హామీలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు , జగన్ పాలనపై పెరుగుతున్న వ్యతిరేఖత, ఏపీలో పెరిగిపోతున్న వివిధ సమస్యలు, ధరల పెరుగుదల, ఇలా అన్ని అంశాలు ప్రజలని ఆలోచనలో పడేశాయి ..
ఇక సోషల్ మీడియా వేదికగా టిడిపి శ్రేణులు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కు సంబంధించి ఏ చిన్న అంశం దొరికినా, సోషల్ మీడియా వేదికగా దానిని వైరల్ చేస్తూ జనాలలో వైసీపీ బాగోతాన్ని బయట పెడుతున్నారు .. ఇక ఏపీలో ప్రతిపక్షపార్టీలు జగన్మోహన్ రెడ్డి ని ఎలాగైనా సీఎం సీటు నుంచి దించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి..ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలు వైసీపీ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.. దీంతో ఏపీ ప్రజలలో వైసీపీ పై వ్యతిరేఖత మొదలైనది.. ఒక వైపు లోకేష్ ప్రజాగళం కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తుంది .ఏ జిల్లాకి వెళ్ళిన జనం నీరాజనాలు పలుకుతున్నారు . ఇదే సమయంలో వైసీపీ సర్కార్ ఏమి చేయడం లేదని ప్రజలకి అర్ధం అవుతుంది .. పలువురు మేధావులు సైతం వైసీపీ ఖేల్ ఖతం అని స్పష్టం చేస్తున్నారు ..
ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు .. వైసీపీ గేమ్ ఓవర్ అని .. సైకిల్ సైరన్ మోగడం ఖాయమని తేల్చి చెప్పారు 2024లో వైసీపీని టీడీపీ, జనసేన సీపీఐ కడిగిపారేయబోతున్నాయని స్పష్టం చేశారు .. ఇది ఎవరూ అంగీకరించలేని చేదు వాస్తవం అని ఆయన అభిప్రాయం పడ్డారు . ఐదేళ్ల పాలనలో జగన్ ఎన్నో వ్యతిరేకతలను కూడగట్టుకున్నారని అయన చెప్పుకొచ్చారు .. జగన్ ప్రజాకంఠక పాలనే అయనకి వ్యతిరేఖంగా మారుతుందన్న అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి వ్యక్తం చేశారు
ఇక జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాలు అన్యాయానికి గురయ్యాయి ..ఏ వర్గం కూడా బాగుపడింది లేదు .. మీట నొక్కి డబ్బులు వేస్తున్నా అని చెప్పినా ..అందులోను కోతలే ..అభివృద్ధి ఆనవాళ్లే కనిపించడం లేదు .. గత ప్రభుత్వం చేసినా అభివృద్ధిని కొనసాగించడం పక్కన పెడితే .. కూల్చడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతుంది .అందుకే జగన్ సర్కార్ ని కూల్చడానికి ఓటర్లు సిద్ధం అవుతున్నారు .. తాజగా ఈ విషయాన్నీ సీనియర్ జర్నలిస్ట్ లు సైతం స్పష్టం చేస్తున్నారు