ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం .. వారిని అనేక ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పాలన సాగుతుంది .. ముఖ్యంగా కొందరిని టార్గెట్ చేస్తూ .. టీడీపీకి అండగా ఉన్నవారిని అణచడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతుంది .. అయితే పలువురు టీడీపీ నేతలు జగన్ దౌర్జన్యాలకు , అక్రమ కేసులకు ఎదురొడ్డి నిలుస్తున్నారు ..అలాంటి వారిలో టీడీపీ సీనియర్ నేత నారాయణ ఒకరు .. జగన్ ఎన్ని అరాచకాలు చేస్తున్న ఆయన మొండిగా ముందుకు పోతున్నారు .. అంతేకాదు ఏపీలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల్లోని ప్రముఖులపై జగన్ వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయి భయపెట్టి లొంగదీసుకొని కొందరిని తన పంచన చేర్చుకొని, ఆయా వర్గాలన్నీ తనతో ఉన్నాయని నమ్మించే దుష్ట ఆలోచనలో జగన్ ఉన్నాడు .. అయితే నారాయణ వాటికి భయపడకుండా ముందుకు సాగుతున్నాడు .
కక్షసాధింపులో భాగంగా నారాయనని అరెస్ట్ కూడా చేశారు . పదో తరగతి పరీక్షల్లో లీకేజీల తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేశారు . రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల నిర్వహణలో విఫలమైన వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సమయంలో .. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేసి ఆయనను దోషిగా చూపే ప్రయత్నం చేసింది.. పరీక్ష ల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను ఎ బాధ్యుడిని చేసే ప్రయత్నం చేసింది . సరైన ఆధారాలు కూడా చూపించకుండా చర్యలు కూడా తీసుకున్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా…విచారణ చెయ్యకుండా నేరుగా అరెస్టు చేసి తమ కక్ష పూరిత బుద్దిని చాటుకున్నారు .
చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులని చెయ్యడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు .. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టిడిపి నేత నారాయణపై అక్రమ కేసులు బనాయించి పలు ఇబ్బందులకు గురి చేశారు ..
జగన్ సీఎం అయిన తర్వాత టీడీపీ నేతలను రకరకాలుగా వేధింపులకు గురి చేస్తునే ఉన్నారు .. . ముఖ్యంగా టిడిపికి వెన్నుదన్నుగా నిలిచిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పొంగూరు నారాయణ వంటి నేతలను లక్ష్యంగా చేసుకొని జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం, అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పుతోపాటు టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ నారాయణపై ఇప్పటికే ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది నారాయణకు సీఆర్పీసీ 41 కింద ఏపీ సిఐడి అధికారులు నోటీసులు కూడా గతంలో జారీ చేశారు. నారాయణ కుమార్తెలు సింధూర, శరణిలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఇన్ని చేస్తున్న నారాయణ మాత్రం లొంగడం లేదు
ఇక నారాయణ ని తాము ఏమి చేయలేమని నిర్ధారణకు వచ్చిన జగన్ దొంగ మార్గంలో ఎటాక్ చేయడం మొదలు పెట్టారు ..అందుకు అయన మరదలు ప్రియని పావుగా వాడుకుంటున్నారు తెలుస్తుంది . తాజాగా అయన నారాయణపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రియ వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని స్పష్టం అవుతుంది ..అయితే ఇలాంటివి ఎన్ని చేసిన నారాయనని ఏమి చేయలేరని వాళ్ళు తెలుసుకోలేకపోవడం వాళ్ళ అవివేకం అని చెప్పవచ్చు ..