తమిళ హీరో కార్తీతో సెల్వరాఘవన్ తెరకెక్కించిన చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’. ఈ చిత్రాన్ని తెలుగులో యుగానికి ఒక్కడు టైటిల్ తో అనువదించారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమాకి సీక్వెల్ రానుందని గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సీక్వెల్ కి సంబంధించి అపిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ మూవీ వచ్చి పదేళ్లు అయిన తర్వాత ఇప్పుడు సీక్వెల్ ని ప్రకటించడం విశేషం.
మరో విశేషం ఏంటంటే.. ‘ఆయిరత్తిల్ ఒరువన్’ లో హీరోగా కార్తీ నటిస్తే.. సీక్వెల్ లో ధనుష్ హీరోగా నటిస్తుండడం విశేషం. న్యూయర్ సందర్భంగా ఈ మూవీని ఎనౌన్స్ చేసి టీజర్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కథను బట్టి కార్తీకి బదులు ధనుష్ ని తీసుకున్నారా.? లేక వేరే కారణం ఏదైనా ఉందా..? అనేది తెలియాల్సివుంది. ఈ సినిమా గురించి ధనుష్ ట్విట్టర్ లో స్పందిస్తూ… ప్రీ ప్రొడక్షన్ వర్కే కి సంవత్సరం పడుతుంది.
ఈ సినిమా ఓ అద్భుతం. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి మా వంతు కృషి చేస్తాం. ఆయిరతిల్ ఒరువన్ యువరాజు 2024లో తిరిగి రాబోతున్నాడు’ అన్నాడు. సెల్వరాఘవన్ తెలుగులో 7/జి బృందావన కాలనీ ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుచేత ఈ మూవీ కి కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. మరి.. 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో..? కార్తీని కాకుండా ధనుష్ ని తీసుకోవడం ఎంత వరకు కరెక్టో అప్పుడు తెలుస్తుంది.
A magnum opus !! The pre production alone will take us a year. But a dream film from the master @selvaraghavan ! The wait will be long. But we will give our best to make it all worth it. AO2 ..The Prince returns in 2024 https://t.co/HBTXeN66iA
— Dhanush (@dhanushkraja) January 1, 2021