మిల్కీ బ్యూటీ తమన్నా శీతాకాలం బ్యూటీ అయిపోయింది. ఆమె తాజా సినిమా టైటిల్ ‘గుర్తుందా శీతాకాలం’. ఇందులో ఆమె వైవిధ్యమైన పాత్ర పోషింస్తోందట. అది విలన్ పాత్ర అని అంటున్నారు. సత్యదేవ్, తమన్నా జంటగా నటించనున్న ఈ చిత్రంలో ప్రేమకథ ఓ శీతాకాలంలోనే మొదలుకానుందట. అందుకని ఈ సినిమాకి‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి నాగశేఖర్ దర్శక-నిర్మాత, భావనా రవి మరో నిర్మాత. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇది కన్నడ హిట్ ‘లవ్ మాక్‌టైల్’కి రీమేక్ సినిమా.
ఏజ్ బార్ అవుతున్నా మిల్కీ బ్యూటీ లుక్స్ మాత్రం రోజు రోజుకీ యంగ్ గా మారిపోతున్నాయి. టాలీవుడ్ లో బాలకృష్ణ తప్పితే మిగతా అందరు హీరోల సరసన నటించేసిన తమన్నా ఇప్పుడు చిన్న పెద్ద తేడా అన్నదే లేకుండా అన్ని చిత్రాలనూ ఒప్పుకుంటోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా తమన్నాకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. తమన్నా తాజాగా కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ లవ్ మాక్ టైల్ తెలుగు రీమేక్ లో నటించడానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో కేవలం 20 నిమిషాలు కనిపించే పాత్ర కోసం తమన్నా ఏకంగా రెండు కోట్లకి పైనే తీసుకుంటుందని టాక్. ఆమె విలన్ గా నటించే సినిమా ఇదేనట. ఈ సినిమా టైటిల్ ‘గుర్తుందా శీతాకాలం’కు మంచి స్పందన లభిస్తోంది. దీంతో పాటు తమిళంలో శింబు సరసన నటించేందుకు కూడా తమన్నా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందంటున్నారు. శింబు స్వీయనిర్మాణ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఓ మాస్ మసాలా మూవీకి హీరోయిన్ గా తమన్నా ఎంపికైంది.











