నారా లోకేష్ మరోసారి ట్వీట్లలో రెచ్చిపోయారు. ఈసారి జగన్ జైలు జీవితం మీద ఆయన సూటింగా తన విమర్శలు సంధించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. అవినీతి వ్యవహారాలపై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబరు ప్రారంభిస్తే, దాని మీద కూడా నారా లోకేష్ సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఆయన తన ట్వీట్లలో ప్రస్తావించారు.
జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అవినీతికి అడ్డుకట్ట వేస్తానని ప్రకటించారు. ఆ మేరకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే అవినీతిపై ఫిర్యాదులకు ఒక టోల్ ఫ్రీ నెంబరును కూడా ప్రకటించారు.
నిజానికి అవినీతిపై ఫిర్యాదులకు కొత్తగా ఒక నెంబరు ప్రకటించడం అనేదే పెద్ద కామెడీ. ఎందుకంటే.. ఆల్రెడీ ఇదే పనిచేయడానికి అవినీతి నిరోధక శాఖ ఉంది. ఆ శాఖ నిజంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటే, ఫిర్యాదు చేసిన వారి ప్రైవసీని కాపాడే ఏర్పాటు ఉంటే.. ఇప్పుడు బయటకు వస్తున్న అవినీతి కేసుల కంటె.. నాలుగైదు రెట్లు ఎక్కువగా బయటకు వస్తుండేవి. ఉన్న సిస్టమ్ సక్రమంగా పనిచేస్తే చాలు. అలాగని కొత్తగా ఒక టోల్ ఫ్రీ నెంబరు పెట్టడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఏర్పాటుపై నారాలోకేష్ మాత్రం సెటైరు వేస్తున్నారు. ఆయన తన ట్వీట్లో …
‘‘జగన్ రెడ్డి గారూ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ 14400 పెట్టారు. అవినీతి చక్రవర్తి, క్విడ్‌ప్రోకో కింగ్, ప్రజలసొమ్ము 43 వేల కోట్లు కొట్టేసి సీబీఐ..ఈడీ కేసుల్లో ఏ1గా ఉంటూ చంచల్‌గూడలో 16 నెలల్లో జైలులో ఉన్నందుకు గుర్తుగా మీకిచ్చిన నెంబర్ 6093.
ఇదే నెంబర్ అవినీతి పై ఫిర్యాదు చెయ్యడానికి టోల్‌ఫ్రీకి పెడితే సింబాలిక్‌గా ఉండేది! మీరు దోచేసిన ప్రజా సొమ్ము ప్రభుత్వ ఖజానాకి జమచేసి, అప్పుడు అవినీతిపై మాట్లాడితే బాగుంటుంది జగన్ రెడ్డి గారు ఒక సారి ఆలోచించండి.’’
అంటూ జగన్ కు సలహా ఇచ్చారు.
జగన్ కోర్టు కేసుల్లో ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు, ఆయన జైలు జీవితం గురించి ప్రస్తావిస్తూ లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి వైకాపా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
.@ysjagan గారూ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ 14400 పెట్టారు. అవినీతి చక్రవర్తి, క్విడ్‌ప్రోకో కింగ్, ప్రజలసొమ్ము 43 వేల కోట్లు కొట్టేసి సీబీఐ..ఈడీ కేసుల్లో ఏ1గా ఉంటూ చంచల్‌గూడలో 16 నెలల్లో జైలులో ఉన్నందుకు గుర్తుగా మీకిచ్చిన నెంబర్ 6093.(1/2) pic.twitter.com/KU6PyC7lPT
— Lokesh Nara (@naralokesh) August 25, 2020










