హీరోయిన్ తమన్నాకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. తమన్నా ఇంట్లో కరోనా కలకలం రేగినట్లుగా బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. వీకెండ్ నుంచి అమ్మ నాన్నలకు లైట్ గా కొవిడ్ లక్షణాలు కనిపించడంతో ఇంట్లో అందరమూ టెస్టులు చేయించుకున్నాం అని.. వారిద్దరికీ పాజిటివ్ వచ్చిందని తమన్నా పేర్కొంది. మిగిలిన వారందరికీ నెగటివ్ వచ్చినట్లు తెలిపింది.
కానీ విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. తమన్నాకు కూడా పాజిటివ్ వచ్చినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆ సంగతి బయటపెట్టకుండా దాచారని సమాచారం. నిజానికి శుక్రవారం తమన్నా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ ప్రెస్ మీట్ కు కొవిడ్ కారణంగా రావడం కుదరదని ఆమె సంబంధిత వ్యక్తులకు తెలియజేశారు.
అభిమానులంతా ఆమె తల్లిదండ్రులు కొవిడ్ నుంచి కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.
— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 26, 2020











