అరేబియా సముద్రంలో ఏర్పడిన తాక్టే ధాటికి సమీస ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. పెను తుఫాను కారణంగా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్, మహరాష్ర్ట, కర్ణాటక పలుచోటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముంబై భారీగా వర్షాలు కురుస్తుండటంతో విమానాలు, పలు రైళ్లు, ఇతర రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. అయితే తాక్టే ధాటికి ఓ కమర్షియల్ నౌక రాయిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 270 మంది గల్లంతు అయ్యినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న భద్రత దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. కాగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
Must Read ;- దూసుకొస్తున్న తుఫాను.. తెలుగు రాష్ట్రాలపై తక్కువ ప్రభావం











