విపక్షాని అణచివేయాలని చూడటం.. అవివేక చర్యే!
మాచర్ల లో నిరంకుశత్వం రాజ్యమేలుతోంది! నియోజకవర్గంలో టీడీపీ ఎదుగుదలను, వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక ఎమ్మెల్యే, ప్రభుత్వం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు, ఫ్యాక్షన్ రాజకీయాలకు తెగపడుతున్నారు. నిన్న ఆదివారం సాయంత్రం నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని అధికార పార్టీకి చెందిన వైసీపీ జడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద తనయుడు శెట్టిపల్లి కోటేశ్వరరావు సుత్తితో కూల్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై టీడీపీ వర్గాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాచర్ల నియోజకవర్గ పరిధిలో అధికారపార్టీ రాక్షసకాండను అడ్డుకునేందుకు టీడీపీ ఇంఛార్జీ జూలకంటి బ్రహ్మారెడ్డి శాంతియుత నిరసనకు పిలుపునిచ్చారు. శాంతియుత నిరసనకు బయలుదేరిన బ్రహ్మారెడ్డిని కారంపూడి మండల పరిధిలోని ఒప్పిచర్ల వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దఎత్తున పోలీసులు బ్రహ్మారెడ్డి వాహనాన్ని అడ్డుగించి.. పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని స్టేషన్ కు తరలించారు.
పల్నాడులో రాజకీయ వేడి రాజుకుంది..!
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా పల్నాడు పై ఫోకస్ చేశాడు. అందులో మాచర్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. గతంలో ఇంఛార్జులుగా చేసిన వారు పార్టీని ముందుకు తీసుకుపోయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారు. దీంతో పార్టీ నేతల సమాలోచనల మేరకు మాచర్లకు టీడీపీ ఇంఛార్జీగా జూలకంటి బ్రహ్మరెడ్డిని నియమించారు. బ్రహ్మారెడ్డి నియామకంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా యాక్టీవేట్ అయ్యాయి. ఇలా ఒక్కసారిగా పార్టీ పుంజుకోవడాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీశారు. మాచర్లలో టీడీపీ ఫ్లెక్సీలను చింపడం, దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేందుకు ప్రయత్నించడం వంటి చర్యలు అమానుషం. దీనిని ఖండించి టీడీపీ పై దాడులకు తెగపడటం, పోలీసులు చర్యలు ప్రయోగించి అరెస్ట్ లు చేయిస్తున్నారు. ఇటువంటిి దేనికి దారితీస్తాయోనని నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పల్లెల్లో సమిసిపోయిన ఫ్యాక్షన్ రక్కసి మరోసారి కూరలు చాచడం ఖాయమని కుటుంబాలను పోగొట్టుకున్న బాధితులు వాపోతున్నారు. దీనికి స్వస్తి చెప్పకుంటే ఇంకా చాలా దూరంపోయ్యే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు.











