జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై వినిపిస్తున్న వాదనలు..!
ఏపీ సీఎం జగన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లను కలిసేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇరువురితో విడివిడిగా జగన్ రెడ్డి సమావేశమవుతారని ప్రభుత్వం వర్గాలు తెలిపుతున్నాయి. గడిచిన రెండునరేళ్లల్లో ఢిల్లీ వెళ్తున్న ప్రతిసారి ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్ర విభజన హామీలు, పోలవరం అంచనా వ్యయం రూ. 55,565.87 కోట్లు, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు వంటి తదితర అంశాలను ప్రధాని, అమిషాలతో చర్చించాం.. వాటిని సాధిస్తాం అని జగన్ రెడ్డి, వైసీపీ అధిష్టానం వెల్లడిస్తూనే వస్తున్నాయి. ఈ సారి కూడా సేమ్ పాట పాడుతున్నారు. కానీ జగన్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటన అఫిషియల్ గా ఖరారు అయినా .. కేవలం ఆయన వ్యక్తిగతమేనని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. బాబాయి వివేక హత్యకేసు, అక్రమాస్తుల కేసులో ఈడీ బిగిస్తున్న ఉచ్చు, జగన్, కడప ఎంపీ అవినాశ్ అరెస్టులకు రంగం సిద్ధమైందని వస్తున్న వాదనలూ నడుమ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారి హీటెక్కాయి. జగన్ కూడా అభద్రతా భావానికి గురౌతున్నారని.. అందుకే మోదీ, అమిత్ షాలను ప్రసన్నం చేసుకుని వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీ పర్యటన అంటూ.. ఏపీ బీజేపీ, టీడీపీ లు విమర్శిస్తున్నాయి!
మూడు రాజధానులను ఢిల్లీ పెద్దలకు ఒప్పుకుంటారా?
రాష్ట్ర సమస్యలతోపాటు ప్రధానంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొస్తారని అధికార వైసీపీలో ప్రచారం ఊపందుకుంది! మూడు రాజధానుల వద్దూ.. అమరావతే ముద్దు అని ఇటీవల తిరుపతి కేంద్రంగా అమిత్ షా ఏపీ బీజేపీ నేతలకు తలంటి మరి స్ట్రైట్ ఫార్వార్డ్ గా చెప్పారు. దీంతో ఏపీ బీజేపీ కూడా అలర్ట్ మోడ్ కు వచ్చింది. రైతు పాదయాత్రలో సంఘీభావం తెలిపి.. అమరావతికి జై కొట్టారు. అలానే విజయవాడలో ప్రజా ఆగ్రహ సభ నిర్వహించి.. బీజేపీకి ఏపీలో అధికారమిస్తే.. మూడేళ్లల్లో అమరావతిని నిర్మిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇలా ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ స్టాండ్ ఒక్కటే.. అదే ఏపీ రాజధాని అమరావతి అన్నది ఫిక్స్! మరి మూడు రాజధానుల గురించి ఎందుకు జగన్ ప్రస్తావిస్తాడని విశ్లేషకుల విమర్శలు. అసలు రాష్ట్ర ప్రయోజనాలకు, రావాల్సిన నిధులు, ఇచ్చిన హామీల సాధనకు అమిత్ షాతో పనేంటి అని కూడా వాదనలు లేకపోలేదు. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీ తోపాటు మంత్రి అమిత్ షా వద్ద కూడా హాజరు వేయించుకుని వస్తుంటారు. ఇది కేవలం జగన్ వ్యక్తిగత పర్యటన మాత్రమేనని.. దీని ద్వారా రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.











