ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు నేరచరిత గలవారి పట్ల మక్కువ అని అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం తెలిపిన నలుగురిలో ఇద్దరికి క్రిమినల్ రికార్డు ఉందని అన్నారు. నేర చరితులను ఎమ్యెల్సీ లు గా చేయడం కోసం సాక్షాత్తు గవర్నర్ వద్దకు వెళ్లారని అన్నారు. ఇప్పటికే నేర చరిత కలిగిన ఎంతోమంది మంత్రిమండలిలోనూ, శాసనసభలోనూ, పార్లమెంటు సభ్యులుగానూ, చైర్మన్లుగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ చుట్టూ నేరచరితులే ఉన్నారని వర్ల రామయ్య విమర్శించారు.
ముఖ్యమంత్రి గారికి నేరచరిత గలవారి పట్ల మక్కువెక్కువ. రాష్ట్రమంతా ఎరిగిన యిద్దరు నేరచరితులను ఎమ్యెల్సీ లు గా చేయడం కోసం సాక్షాత్తు సతీ సమేతంగా గవర్నర్ గారి వద్దకు వెళ్లారు. మంత్రిమండలిలో ,శాసనసభలో, పార్లమెంట్ సభ్యులుగా, సలహాదారులుగా, చైర్మన్లుగా, ఆయన చుట్టూ ఎందరో నేరచరితులు గదా?
— Varla Ramaiah (@VarlaRamaiah) June 15, 2021