ప్రచారంలో భాగంగా యానాంలో వైసీపికి చెందిన మంత్రి ఎస్ వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు ప్రచారం చేస్తున్నారు. యానాం ఎన్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ రంగస్వామికి మద్దుతుగా వీరు ప్రచారం చేస్తున్నారు. కాగా, పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ మేనిపెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఓ వైపు వైసీపీ నాయకులు అక్కడ ప్రచారం చేయడం, బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడంపై టీటీపీ మాజీ మంత్రులు నారా లోకేష్, అయ్యన్న పాత్రుడులు ట్విట్టర్ వేదికగా వారిపై విమర్శలు గుప్పించారు.
మోదీ మెడ వంచి తెస్తానన్న ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టిన ఫేక్ సీఎం గారూ! ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటోంది. ఏపీకి ముగిసిన అధ్యాయమైన ప్రత్యేకహోదా పుదుచ్చేరిలో ఎలా మొదలవుతుందో?(1/2) pic.twitter.com/0d4YQRypzd
— Lokesh Nara (@naralokesh) April 1, 2021