మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘రంగస్థలం’ సినిమా తీసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు బ్రిలియెంట్ డైరెక్టర్ సుకుమార్. రామ్ చరణ్ తన కెరీర్ లోనే చిట్టిబాబు పాత్రతో అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఈ సినిమా విడుదలై.. అప్పుడే మూడేళ్ళయింది. హీరోగా చెర్రీకి, దర్శకుడిగా సుక్కూకి ఓ మెమరబుల్ మూవీ అయిపోయింది ‘రంగస్థలం’. అందుకే ఈ సూపర్ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలున్నాయని టాక్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తెరకెక్కించే బిజీలో ఉన్నాడు. సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేస్తూండడంతో .. షూటింగ్ ను స్పీడప్ చేశాడు సుకుమార్. ఇక దీని తర్వాత విజయ్ దేవరకొండతో సినిమాను అనౌన్స్ చేశాడు సుకుమార్. అలాగే.. రామ్ చరణ్ ప్రస్తుతం ఆచార్య , ఆర్.ఆర్.ఆర్ సినిమాల వ్యవహారంలో ఊపిరిసలపని బిజీగా ఉన్నాడు. రెండు సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ అవడంతో .. ఆ సినిమాల కంప్లీషన్ లో ఉన్నాడు చెర్రీ.
మొత్తం మీద ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు బిజీగా ఉన్న రామ్ చరణ్, సుకుమార్ .. అవి పూర్తయ్యాకా .. తమ కాంబో సినిమాను అనౌన్స్ చేస్తారట. ఈ సినిమాను కూడా రంగస్థలం మేకర్స్ మైత్రీ వారే నిర్మిస్తారట. రంగస్థలంలో రామ్ చరణ్ ను చెవిటి చిట్టిబాబును చేసిన సుక్కూ.. మరి ఈ సినిమా కోసం ఏ పాత్రను డిజైన్ చేస్తాడో చూడాలి.
Also Read:లెక్కల మాస్టారుకు ‘ఉప్పెన’ లాంటి కిక్కు











