వరుసగా మూడో రోజు అసెంబ్లీ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కి గురయ్యారు.సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారంటూ టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఏడవ రోజు సమావేశాలు ప్రారంభం కాగానే జే బ్రాండ్స్ మద్యం, నాటుసారాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభలో చప్పట్లు కొడుతూ తమ నిరసనను తెలిపారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.తెలుగుదేశం ఎమ్మెల్యేల ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ రూల్ పాస్ చేశారు. నిన్న ముఖ్యమంత్రి పై టిడిపి ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసును ఆర్డర్‌లో లేనందున్న తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. అదేసమయంలో సభ్యులు ఎవరూ అసెంబ్లీలోకి సెల్ ఫోన్ లు ,ప్లే కార్డులు తేకూడదని , రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టకూడదని రూల్ నెంబర్ 317 లో చేర్చానున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. అయితే స్పీకర్ రూలింగ్ పై తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తలిపారు.స్పీకర్ రూలింగ్ సభ్యుల హక్కులను హరించే విధంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు.
Must Read:-టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు