నాలుగేళ్ల క్రితం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఆర్జీవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్నికల ఓటమి తర్వాత సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఎలా మారిపోయింది. అతని జీవితంలోకి పార్వతి ఎలా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందనే వివాదాస్పద అంశంతో పెద్ద దుమారమే రేపింది. ఈ సినిమా విడుదల సమయంలో ఏపీలో చాలా చోట్ల ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఆ తర్వాత ‘అమ్మ రాజ్యమో కడప బిడ్డలు’ అంటూ మరో వివాదాస్పద సినిమా తీసి చాలా మందికి టార్గెట్ అయ్యాడు. ఇక ఇప్పుడు అదే స్టైల్లో ‘వ్యూహం’ సినిమాతో ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేందుకు వస్తున్నాడు.
ఈ మద్యే వ్యూహం టీజర్ విడుదల చేసాడు ఆర్జీవీ, అయితే ఆ టీజర్ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే లేపింది.. YSR హెలికాప్టర్ ప్రమాదం, YSR మరణం తర్వాత ఏం జరిగింది, ఎవరు స్పందించారు? జగన్ అరెస్టు దృశ్యాలు, జగన్ పార్టీ సన్నివేశాలను టీజర్‌లో చూపించారు, అదే సమయంలో మిగతా పార్టీలని చేదుగా చూపించే ప్రయత్నం చేసారు, అందులో టీడీపీ, మరియు చంద్రబాబు మీద బురద జల్లే ప్రయత్నం చేసినట్టు టీజర్లో కనపడింది, ఆర్జీవీ కావాలనే ఒక పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నాడని తెలుస్తోంది.
అయితే ఆర్జీవీ వ్యూహం సినిమాను రెండు భాగాలుగా తీయబోతున్నాడని సమాచారం, ఈ రెండు బాగాలుకూడా ఎలేచ్షన్స్ ముందు మొదటి పార్ట్, రెండవ భాగం ఎలక్షన్ సమయంలో విడుదల చేయాలనీ వర్మ ప్లాన్ చేసిన్నట్టు తెలుస్తోంది, ఇదంతా వైసీపీ గేమ్ ప్లాన్ అని అర్ధమవుతుంది. సినిమా చూసి సీఎం వైస్ జగన్ కి ఓట్లు వేసేంత వీరి జనాలు కాదు అని కొందరు వైసీపీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది. జగన్ కి సినిమా పిచ్చి ఎక్కువైందని, అందులోను తన మీద సినిమా బయోగ్రఫీ తీపించుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద కామెడీగా వర్ణించుకుంటున్నారు.
అలాగే ఆర్జీవీ, వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ ప్రకారం సినిమా విడుదల అవ్వాలంటే షూటింగ్ శరవేగంగా జరగాలి, అయితే ఆ సినిమాలో సీఎం జగన్ పాత్ర దారి అజ్మల్ అమీర్ వైరల్ ఫీవర్ తో మంచాన పడ్డాడని తెలుస్తోంది, దీంతో అర్జీవికి పెద్ద టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. షూటింగ్ కి ఇలా బ్రేక్ పడటంతో రామ్ గోపాల్ వర్మ కి కొత్త తలనొప్పి మొదలైందని తెలుస్తోంది. అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయలేమని వాపోయాడని తెలుస్తోంది..