ఇటు తెలంగాణలో, అటు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాజన్న బిడ్డ, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో ఆమె పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్లు సమాచారం.
తాజాగా వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చర్చల తర్వాతే ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి భయం పట్టుకుందని తెలుస్తోంది, షర్మిళ కాంగ్రెస్లో విలీనం చేసాక, ఏ నియోజక వర్గం నుండి పోటీ చేస్తుంది అని ఆరా తీయడం మొదలు పెట్టాడని తెలుస్తోంది, కొంపలో కుంపటి అన్నట్టు, షర్మిళ జగన్ పార్టీ కె ఎసరు పెట్టెల కనపడుతుంది అని వైసీపీ వర్గాల్లో టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది, వైస్ షర్మిల రాయలసీమలోని కడప జిల్లాలో పోటీ చేస్తే అది జగన్ కి, వైసీపీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అని అందుకే జగన్ తన చెల్లెలా మీద ఓ కన్ను వేసి ఉంచాడని తెలుస్తోంది.
అది కాకుండా తెలంగాణ నుండి పోటీ చేయాలనీ షర్మిలా ఆలోచిస్తే, కాంగ్రెస్ షర్మిల నిర్ణయానికి అడ్డు చెప్పడం లేదని తెలుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని షర్మిల మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలకు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేస్తారని తెలుస్తోంది. అదిష్టాన కూడా అంగీకరించినట్లు సమాచారం. కానీ జగన్ మాత్రం చెల్లెలి భయం తో తల పట్టుకుంటున్నాడని తెలుస్తోంది..











