తల్లికి వందనం.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానం సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన హామీలలో ఒకటి.. ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడు తల్లికి వందనం అమలు చేయలేరని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలంగా నమ్మాడు… ఆయన అదే అంశాన్ని పదే పదే ప్రచారం చేశాడు.. ఎందుకంటే, ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికి 15వేలు ఇవ్వడం అంటే అసాధారణ విషయం అనుకున్నాడు వైసీపీ అధినేత. కానీ, తాజాగా తల్లికి వందనం తల్లుల అకౌంట్లలో పడిందో లేదో జగన్‌కి, ఆయన పార్టీకి సౌండ్ లేదు.. తమని ఇది చావు దెబ్బ కొట్టిందని వైసీపీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతుండడం విశేషం..
2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15 వేలు అని ఊదరగొట్టాడు జగన్.. నీకు 15, నీకు 15 అంటూ.. జగన్ సతీమణి భారతి సైతం ప్రచారం చేశారు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తూచ్ అన్నాడు.. ఇంటికి ఒకరికే అని మాట మార్చాడు.. మడమ తిప్పాడు.. కానీ, చంద్రబాబు సర్కార్ మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు.. ఎన్నికల సమయంలో ఏ వాగ్ధానమయితే ఇచ్చాడో… అక్షరాలా దానిని పాటించాడు.. ప్రతి విద్యార్ధికి పదిహేను వేల రూపాయలను డిపాజిట్ చేశాడు… ఇంటిలో ఎంతమంది ఉంటే, వారందరికీ పది హేను వేల రూపాయలను అందించాడు చంద్రబాబు.. రాష్ట్ర ఖజానాపై భారం అని చూడలేదు.. తను ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలనుకున్నారు.. అంతే, ఆచరించారు.. ఇటు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పట్టుదల కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోయేలా చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..
ఇదే ఇప్పుడు వైసీపీకి ఫుల్ డ్యామేజ్ అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. జగన్ ఏడాదికి కేవలం 4 వేల కోట్లకే చేతులు ఎత్తేస్తే, దానికి దాదాపు రెండున్నర రెట్లు… అంటే పది వేల కోట్లను అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేసింది కూటమి సర్కార్.. దీంతో, తల్లిదండ్రుల మోముల్లో ఆనందం తాండవిస్తోంది.. కర్నూలులోని ఓ ఇంట 12 మంది సంతానం ఉంటే, వారందరికీ కలిపి సుమారు లక్షన్నర అకౌంట్లోకి చేరింది.. ఇలాంటి కుటుంబాలు బోలెడు..
ఇప్పటివరకు జగన్.. తనకు తాను సంక్షేమ సారధిగా, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పుకునేవాడు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత సంక్షేమానికి ఆయనే పెద్ద దిక్కుగా అభివర్ణించారు వైసీపీ నేతలు.. అయితే, జగన్ సంక్షేమం పరిమితి, పరిధులకి లోబడి నడిచింది.. తాజాగా చంద్రబాబు 4. ఓ పాలనలో సంక్షేమానికి ఆయన కొత్త అవతారంగా అవతరించారు…. కుటుంబంలోని ప్రతి విద్యార్ధికి తల్లికి వందనం అందించి ప్రజల మనసు దోచుకున్నారు.. జగన్‌ని తన సరసన చంద్రుడు పక్కన చిన్న చుక్కగా మార్చుకున్నారు.. వైసీపీ అధినేతను మైనస్‌లలోకి నెట్టారు చంద్రబాబు..
ఈ నెల 20వ తేదీన ప్రతి రైతుకి 20 వేల రూపాయల అన్నదాత భరోసా అందించడానికి సిద్ధం అవుతున్నారు చంద్రబాబు… దీనిపై నిన్నమొన్నటివరకు వైసీపీ నేతలు సెటైర్లు విసిరారు.. కూటమి సర్కార్ హామీలు ఇవ్వడమే కానీ, అమలు చేయడం లేదని.. ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ వదలకుండా నిలబెట్టుకుంటున్నారు చంద్రబాబు.. ఇప్పటికే, దీపం పథకం అమలు చేశారు.. ఇటు అన్నా కేంటిన్లు నడుస్తున్నాయి… మెగా డీఎస్‌సీ ఎగ్జామ్‌కి రంగం సిద్ధం అయింది.. ఆయన ఇచ్చి నిలబెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మేజర్ హామీ ఆడబిడ్డ నిధి… మేజర్ అయిన మహిళలకు ఏడాదికి 18వేల రూపాయలు అందించడం.. దీనికి సైతం విధి విధానాలు ఖరారు అవుతున్నాయి.. ఇప్పటికే దీనికి సంబంధించిన వెబ్ సైట్ సిద్ధం అవుతోంది..
సూపర్ సిక్స్ హామీల అమలుతో చంద్రబాబు.. సంక్షేమానికి సరికొత్త చిరునామాగా మారిపోయారు.. ఇప్పటివరకు ఆయనను అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే చూసేవారు.. తాజాగా, ఆయన సంక్షేమానికీ పెద్ద పీట వేశారు.. దీంతో, చంద్రబాబు ఏపీకి పెద్ద దిక్కుగా అవతరించారు… జగన్ సంక్షేమం ఆయన పథకాల ముందు చిన్నబోయింది.. మర్రి చెట్టు నీడలో చిన్న చెట్టుగా మారిపోయాడు వైసీపీ అధినేత..
లక్షల వోల్ట్‌ల ప్రకాశవంతమయిన సూర్యకాంతిలాంటి చంద్రబాబు సంక్షేమం ముందు చిన్న టార్చ్ లైట్‌లా మారిపోయారు జగన్…. ఇదే వైసీపీ నేతలని టెన్షన్ పెడుతోంది.. జగన్ మార్క్ పాలనగా సంక్షేమాన్ని తాము నమ్ముకుంటే, చంద్రబాబు వాటికి చెక్ పెట్టారు… ఇదే దూకుడు కనబరిస్తే, జగన్ ఔట్ అని, తమ రాజకీయ భవిష్యత్తు శూన్యం అని బలంగా విశ్వసిస్తున్నారు.. తమ ఓట్ బ్యాంకుకి చంద్రబాబు భారీగా గండి కొడుతున్నారని నమ్ముతున్నారు వైసీపీ నేతలు.. జగన్‌కి లభించిన 39 శాతం ఓట్ బ్యాంకులో మెజారిటీ సంక్షేమ పథకాలను చూసి వచ్చినదే అని, తాజాగా కూటమి సర్కార్ సూపర్ సిక్స్‌తో తమ ఓట్ షేర్ తగ్గిందని ఫ్యాన్ పార్టీ నేతలు నమ్ముతున్నారు.
మొత్తమ్మీద, జగన్‌కి వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు ఎన్నికల నినాదం లేకుండా చేయాలని ఫిక్స్ అయినట్లున్నారు చంద్రబాబు.. మరి, 2029కి వైసీపీ అధినేత ఏ అస్ర్తాలను సిద్ధం చేసుకుంటారో చూడాలి..