హస్తిన పర్యటనలో బిజిబిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. వరుస సమావేశాలతో ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన లోకేష్..వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువగళం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందించారు. ఈ భేటీలో కేంద్రమంత్రి పెమ్మసానితో పాటు పలుపురు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు.
తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, రాబోవు నాలుగేళ్లపాటు నిర్దేశించుకున్న లక్ష్యాలను అమిత్‌షాకు వివరించారు. అమిత్‌షాకి కూడా యువగళం పుస్తకాన్ని అందేశారు లోకేష్.
అమిత్‌షాతో భేటీ అనంతరం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసింది లోకేష్ బృందం. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలపై కేంద్రంత్రితో చర్చించారు. లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు లోకేష్ తెలిపారు. ఆ తర్వాత మరో కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌నూ లోకేష్ టీమ్ కలిసింది. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు..సహకరించాలని చిరాగ్ పాశ్వాన్‌ను లోకేష్ కోరారు. ఆ తర్వాత మరో సెంట్రల్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘావాల్‌తోనూ సమావేశమ్యారు లోకేష్. ఏపీ రాష్ట్ర పురోగతిపై ఆయనతో చర్చించారు. ఐతే మోదీ రాష్ట్రానికి వచ్చే రెండు రోజుల ముందు లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తిగా మారింది.
ఇవాళ కూడా మంత్రి లోకే ఢిల్లీలోనే ఉండనున్నారు. కేంద్రమంత్రి మాండవియాతో సమావేశం కానున్నారు ఆ తర్వాత బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌నూ ఆయన కలవనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరించనున్నారు.











