మూడు రాజధానులపై యూ-టర్న్ తీసుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం
మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ కేబినేట్ అత్యవరస భేటిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ప్రభుత్వ అడ్వికేట్ జనరల్ ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేశారు. గంట పాటు ఏపీ కేబినేట్ అత్యవసర భేటి జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణపై తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు రేగాయి. దీంతో జగన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల చట్టంలో మార్పులు చేస్తారా? రద్దు చేస్తారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ మాత్రం బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడంతో పూర్తి క్లారిటి వచ్చింది. ఇదిలా ఉంటే న్యాయం స్థానం టూ దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు రైతులు గత 22 రోజులుగా మహా పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రకు రాష్ట్రంలోని అన్నిపార్టీలు మద్దతును ప్రకటించాయి. తాజాగా పాదయాత్రకు నిన్న కావలిలో బీజేపీ కూడా పూర్తి మద్దతునివ్వడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.











