తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టి యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ నవశకం సభ దిగ్విజయంగా ముగిసింది.
యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం, జనసేన సంయుక్తంగా నిర్వహించిన నవశకం సభకు రాష్ట్రం నలుమూల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ప్రజలు స్వచ్ఛంధంగా తండోపతండాలు కదిలి వచ్చారు. విజయనగరం జిల్లా, భోగాపురం మండలం, పొలిపల్లి వద్ద నిర్వహించిన ఈ నవశకం సభ ప్రాగణం తెలుగుదేశం, జనసేన పార్టీలతో పాటు స్వచ్చంధంగా తరలివచ్చిన అశేష ప్రజానీకంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూల నుంచి దాదాపు 6 లక్షల మందికి పైగా ఈ సభకు హాజరైనట్లు నిర్వాహాకులు అంచన వేశారు.
సభ వేదికపై తెలుగుదేశం, జనసేన ముఖ్యనేతలు ఆశీనులై ఉండగా.., లక్షలాది మంది ప్రజా బలం వేదిక కింద జయజయధ్వానాలు చేస్తుండగా.. వేదికపైకి ముందుగా యువనేత నారా లోకేష్ ఎంట్రీ ఇవ్వగా.., అధినేతలు చంద్రబాబు, పవన్, బాలయ్యలు అభిమానులకు అభివాదం చేస్తూ వేదికపైకి వచ్చారు. వేదికపై ఉన్న ముఖ్యనేతలను పలకరిస్తూ.. ముందుకు సాగి.. దివంగత ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి వక్తలుగా ఎంపీ రామానాయుడు, వర్ల రామయ్యలు, పయ్యావుల వ్యవహరించారు. సభను ఉద్దేశించి ముందుగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ మాట్లాడగా.., ఆ తరువాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రాధ్యక్షులు కింజవరపు అచ్చెన్నాయుడు, బాలకృమిషన్ నవశకం సభ గ్రాండ్ సక్సెస్..!ష్ణ లు మాట్లాడారు. లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రతో పార్టీలో నూతన ఉత్తేజంతోపాటు.., ప్రజల్లో భరోసాను నింపిందని వారు కొనియాడారు.
అనంతరం లోకేష్ తన పాదయాత్ర సాగిన విధానాన్ని వివరించారు. రెడ్ డైరీ గురించి.., అందులో రాసుకున్న వారిపై భవిష్యత్తులో తీసుకునే చర్యలపై వ్యాఖ్యానించారు. ఆ తరువాత జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తనదైన శైలిలో ఉపన్యాసించి.., అటు టీడీపీ.., ఇటు జనసేన నాయకులను, కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. చివరగా లోకేష్ పాదయాత్ర ముగింపును విజయోత్సవాన్ని గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు అడ్రస్ చేస్తూ.. భవిష్యత్తులో టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యచరణ ఎలా ఉంటుందో వివరించారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ, ఆర్ధిక, సామాజీక రంగాల్లో నెలకొన్న సమస్యలను వివరిస్తూ.. జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. త్వరలో అమరావతి.., తిరుపతి వేదికలుగా సమావేశాలు నిర్వహించి.., ఇరుపార్టీ ఏకాభిప్రాయంతో రూపొందించిన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఓటర్ లిస్ట్ లో దొంగలు పడ్డారని.., అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
మొత్తంగా నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర ముగింపు నవశకం సభ విజయవంతంగా ముగిసిందనే చెప్పాలి.











