ఎట్టి పరిస్థితిలో ఒప్పకోం.. సహాయ నిరాకణే!
ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన చీకటి జీవోలకు సంబంధిచిన వేతనాలను ట్రెజరీ ద్వారా ప్రాసెస్ చేసేందుకు అంగీకరించబోమని ట్రెజరీ ఉద్యోగుల సంఘం తేల్చి చెప్పింది. తాము ఉద్యోగ సంఘాల్లో భాగమేనని గుర్తు చేశారు. గురువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు జీవో జారీ చేసింది. కొత్త పీఆర్సీ, తగ్గించిన హెచ్ఆర్ఏ ప్రకారమే వేతన బిల్లులు తయారు చేయాలని అధికారులను ఆదేశారు. కొత్త సాఫ్ట్ వేర్ తయారు చేసి, ఇప్పటికే జిల్లాలకు కూడా పంపారు. ఈ నెల 25వ తేదీలోపు బిల్లులు పంపాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 23 శాతం ఫిట్మెంట్ కోత పెట్టిన హెచ్ఆర్ఏ, కొత్త డీఏలను కలుపుకుని బిల్లుల తయారీకి సూచనలు చేసింది. ఈ మేరకు ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా జీతాల్లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు శోభన్, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ స్పందించారు.
చీకటి జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలి!
జగన్ రెడ్డి ప్రభుత్వం 11వ పీఆర్సీపై ఇచ్చిన చీకటి జోవోలను తక్షణమే ఉపసంహరిచుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు శోభన్ డిమాండ్ చేశారు. ఒకపక్క రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమ బాటపట్టిన వేళ, చీకటి జీవోల అమలు కొరకు ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ట్రెజరీ ఉద్యోగుల కూడా ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘంలో భాగస్వాములేనని, చీకటి జీవోలను రద్దు చేసే వరకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలను ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ అధికారులు, డ్రాయింగ్ అధికారులు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై స్టేట్ ట్రెజరీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వం విధానాలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది!











