దేశంలో చాలా రాష్ట్రాలలో కరోనా నెమ్మదిగా అదుపులోకి వస్తోంది. కానీ ఢిల్లీలో మాత్రం అదుపుకావడం అనే మాట పక్కన పెడితే, పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య అధికారులను, ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కరోనా కల్లోలానికి కారణాలేంటి?
ఢిల్లీలో కరోనా కేసులు మొదటి నుంచి ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఒకానొక దశలో లాక్ డౌన్ కారణంగా కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా అనిపించినా… లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం మొదలైన క్షణం నుండి ఢిల్లీలో కరోనాను అదుపుచేయడం అలవికాని విషయంగా మారింది. దీనికితోడు పండగ సీజన్, కాలుష్యం, చలికాలం రావటంతో కేసుల సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టే దాఖలాలు ఇప్పట్లో కనిపించడం లేదు.
Must Read: https://www.theleonews.com/deadly-coronavirus-completes-one-year-today/
ఢిల్లీ ఎందుకు ప్రత్యేకం?
దేశంలో ఒకప్పుడు కల్లోలాన్ని రేపిన కరోనా… ఢిల్లీ మినహాయిస్తే, మిగిలిన రాష్ట్రాలలో చాలా వరకు అదుపులోకి వచ్చిందని చెప్పచ్చు. ఒకప్పుడు వేల సంఖ్యలో నమోదైన కేసులు వందల సంఖ్యకు తగ్గడమే అందకు నిదర్శనం. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణం కరోనా పెరగడానికి దోహదపడుతుందని చెప్పచ్చు. అంతేకాదు, రాజధాని కావడం వల్ల ఫ్యాక్టరీలు, జనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల కాలుష్యం పెరుగుతోంది. వాయు కాలుష్యం వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు మెదటినుండి చెప్తూనే ఉన్నారు.
ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతోంది?
ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు… నివారణ చర్యలు చేపట్టడం మొదలుపెట్టాయి. ఢిల్లీలో పాక్షికంగా లాక్ డౌన్ పెట్టె యోచనలో ఉన్నామని సిఎం ప్రకటించడం జరిగింది. కానీ, దాని కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరినట్లుగా తెలియజేశారు. వీటితోపాటు ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న మార్కెట్లలను కొన్నాళ్లు మూసివేయలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ చర్యలతోపాటు, ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే కరోనా నియంత్రణ సాధ్యం అవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా తమకు ఎంతో సహకరిస్తుందని, అందులో భాగంగా 750 ఐసియూ బెడ్లను కరోనా పేషంట్లకు కేటాయించారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కరోనా నియంత్రణకు కష్టపడుతున్నాయని… ప్రజలు సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం వంటి నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.